Karnataka Politics : ఇచ్చిన మాట.. ప్రపంచ శక్తి.. పవర్ పాలిటిక్స్ పై డీకే శివకుమార్

Karnataka Politics : ఇచ్చిన మాట.. ప్రపంచ శక్తి.. పవర్ పాలిటిక్స్ పై డీకే శివకుమార్

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు పూర్తయిన క్రమంలో రాష్ట్రంలో వెంటనే పవర్ షేరింగ్ (అధికార పంపిణీ) ఒప్పందాన్ని అమలు చేయాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులు కోరిన విషయం తెలిసిందే.. ఈ మేరకు డీకే శివకుమార్ ను సపోర్ట్ చేస్తున్న 10 మంది ఎమ్మెల్యేలు గత గురువారం ఢిల్లీకి వెళ్లి రెండున్నరేండ్ల క్రితం చేసిన వాగ్దానాన్ని గౌరవించాలని ఏఐసీసీ చీఫ్ ఖర్గెను కలిశారు. పవర్ షేరింగ్ పై డిమాండ్ పెరుగుతున్న క్రమంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన Xహ్యాండిల్‌లో ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చరేశారు. వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్ అంటూ షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 

ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి  ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం.అది న్యాయమూర్తి అయినా, అధ్యక్షుడైనా లేదా మరెవరైనా, నాతో సహా ప్రతి ఒక్కరూ మాట ప్రకారం నడుచుకోవాలి. పద శక్తి ప్రపంచ శక్తి. అంటూ నిగూఢ అర్థంతో డీకే శివకుమార్ పోస్ట్ చేశారు. 

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలంలో సగం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా డీకే శివకుమార్ వ్యాఖ్యలు  చర్చనీయాంశంగా మారాయి. 2023 మే 20న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల  తర్వాత సీఎం ఎవరనే దానిపై సిద్దరామయ్య, శివకుమార్ మధ్య తీవ్ర పోటీ జరిగింది. శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడితే.. రెండున్నరేండ్ల తర్వాత అధికారం ఇస్తామని హైకమాండ్ దగ్గర ఒప్పందం జరిగినట్లు అప్పట్లో కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే, పార్టీ మాత్రం ఈ ఒప్పందాన్ని ఎప్పుడూ అధికారికంగా ధ్రువీకరించలేదు. 

కర్ణాటకలో పార్టీలో అధికార పోరుపై ఊహాగానాల మధ్య..సిద్ధరామయ్య, శివకుమార్‌లతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే గురువారం అన్నారు.