బీజేపీ ఆఫీస్ బేరర్ల సంఖ్య పెరిగేనా?..

బీజేపీ ఆఫీస్ బేరర్ల సంఖ్య పెరిగేనా?..
  •     పాత సంఖ్యనే కంటిన్యూ చేయాలని అధిష్టానం సూచన 
  •     పోటీ ఎక్కువగా ఉన్నందున సంఖ్య పెంచాలని రాష్ట్ర నేతల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు:  బీజేపీ రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటుకు కసరత్తు కొనసాగుతోంది. ఇటీవలే ఎన్నికైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తన కొత్త టీంను నియమించుకోవడంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో అందరి దృష్టి పార్టీ స్టేట్ ఆఫీస్ బేరర్లపై పడింది. ఆఫీస్ బేరర్ల సంఖ్యను పెంచుతారా? లేదా? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్ర నాయకత్వం సంఖ్య పెంచాలని అధిష్టానాన్ని కోరగా, జాతీయ కమిటీ మాత్రం పాత సంఖ్యతోనే కంటిన్యూ చేయాలని సూచించినట్టు తెలిసింది.

 అయితే, బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటులో కొత్త అధ్యక్షుడికి అధిష్టానం పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.  రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తయి 3వారాలైంది. ఈ నెలాఖరులోగా జిల్లా కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్ర, జిల్లా కమిటీల్లో పాత, కొత్త వారు ఉండేలా చూసుకోవాలని సూచనలు చేసింది. గత కమిటీలో ఉన్న వారిలో కనీసం 40 శాతం మందిని కొత్త కమిటీలోకి తీసుకోవాలని, మిగిలిన 60 శాతం మందిని కొత్త వారిని తీసుకోవాలని చెప్పింది. అన్ని రకాల కమిటీలకు ఇదే వర్తించనున్నది.

 మరోపక్క కులాలకు ప్రాతినిధ్యం ఉండేలా కమిటీలో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు ఉండేలా చూసుకోవాలని, సభ్యులందరికీ క్రియాశీలక సభ్యత్వం ఉండాలని అధిష్టానం నిర్ణయించింది. ఏ కమిటీలోనైనా 60 ఏండ్లలోపు వారికే ప్రయార్టీ ఇవ్వనున్నారు.  జిల్లా కమిటీల తరువాత, రాష్ట్ర కమిటీ ఏర్పాటు కానుండటంతో రాష్ట్ర కమిటీలో స్థానం కోసం ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాష్ట్ర కమిటీలో చోటు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. 

జంబో కార్యవర్గానికి నో.. 

బీజేపీ రాష్ట్ర కమిటీ లిమిటెడ్ గా ఉంటుంది. అధిష్టానం ఇచ్చిన అనుమతి ప్రకారం, రాష్ట్ర కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 8 మం ది కార్యదర్శులు మాత్రమే ఉంటారు. వీరితో పాటు ఒక ట్రెజరర్, సోషల్ మీడియా, మీడియా, ఐటీసెల్ ఇంచార్జీ, ఆఫీస్ ఇంచార్జీ ఉంటారు. మరోపక్క ఏడు మోర్చాలకు రాష్ర్ట అధ్యక్షులనూ ప్రకటించాల్సి ఉంది. ఈ పరిమిత సంఖ్యతోనే కమిటీని ఏర్పాటు చేయాల్సి వస్తుండటంతో, కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిపై ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్నారు. 

ఆఫీస్ బేరర్ పోస్టులు తక్కువ ఉండటం, ఆశావహులు ఎక్కువగా ఉండటం  రాంచందర్ రావుకు తలనొప్పిగా మారింద ని నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కమిటీలో ఆఫీ స్ బేరర్ల సంఖ్యను పెంచుకునే అవకాశం ఇవ్వాలని రాంచందర్ రావు.. ఢిల్లీ నేతలను కోరినట్లు సమా చారం. అయితే, ఢిల్లీ పార్టీ దీనికి రెడ్ సిగ్నల్ ఇచ్చి, సం ఖ్య పెంపునకు స్పష్టంగా నో చెప్పినట్లు తెలుస్తోంది.