వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో పాటు వంట పనులు కూడా ఈజీగా..

V6 Velugu Posted on May 26, 2021

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో పాటు, వంట పనులు కూడా చేయాల్సి వచ్చిన ఆడవాళ్లకు పని భారం బాగా పెరిగింది. పని ఒత్తిడి వల్ల ఒక్కోసారి వంటలు పాడయ్యే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు కొన్ని కిచెన్​ టిప్స్​ పాటిస్తే చాలా ఉపయోగం అంటున్నారు ఎక్స్​పర్ట్స్​.

  • వర్క్‌ టెన్షన్‌లో పడి కూరల్లో ఉప్పు ఎక్కువ పడితే తినలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఆలుగడ్డల్ని మీడియం సైజ్ ముక్కలుగాతరిగి ఉప్పు ఎక్కువైన వంటకంలో వేయాలి. స్టవ్​ని సిమ్​లో ఉంచి ఏడెనిమిది నిమిషాలు ఉడికించాలి. ఆలుగడ్డలు ఉప్పును పీల్చుకుంటాయి. అయితే, ఉప్పుతోపాటు కూరల్లోని వాటర్‌‌ను కూడా ఆలుగడ్డ పీల్చేసుకుంటుంది. అందుకని ఆలుగడ్డ ముక్కల్ని వంటకంలో నుంచి తీసేశాక, అవసరమనిపిస్తే కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి.
  • బయటకు వెళ్లి ఫ్రెష్‌ మీట్‌ తెచ్చుకోవాలంటే ఎక్కడ చూసినా పెద్ద క్యూలు ఉంటున్నాయి. ఏ రిస్క్‌ లేకుండా నాన్‌వెజ్‌ ఎంజాయ్​ చేయాలంటే ఫ్రోజెన్‌ మీట్‌ వాడాలి. ఫ్రోజెన్ మీట్‌ తెచ్చుకుని, కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. వండుకోవాలి అనుకున్నప్పుడు ఫ్రోజెన్​ మీట్​ను ఒక గిన్నెలో వేసి, వేడి నీళ్లు, ఐదు టేబుల్‌స్పూన్స్‌ వెనిగర్‌‌, కొంచెం ఉప్పు వేసి పావుగంట సన్నని మంటపై ఉడికించాలి. ఇలాచేస్తే ఫ్రెష్‌ మీట్‌ వంటకు రెడీగా ఉన్నట్లే. త్వరగా ఉడుకుతుంది. కాబట్టి, నాన్‌వెజ్‌ వంటలు త్వరగా చేసుకోవచ్చు. వేరే ఫ్రోజెన్‌ ప్రొడక్ట్స్‌ కూడా తెచ్చి పెట్టుకున్నా ఉపయోగమే.
  • ఈజీగా వండొచ్చని ఈమధ్య పాస్తా ఎక్కువగా తింటున్నారు. అయితే పాస్తా ఉడకాలంటే ఎక్కువ టైమ్ పడుతుంది. కానీ, ఈ చిట్కా పాటిస్తే ఒకట్రెండు నిమిషాల్లోనే పాస్తా రెడీ అవుతుంది. పాస్తా క్వాంటిటీకి పదిరెట్లు నీళ్లు తీసుకుని ఉడికించాలి. వంద గ్రాముల పాస్తా తీసుకుంటే, దాదాపు వెయ్యి మిల్లీలీటర్ల నీళ్లు పోసి ఉడికించాలి. అందులో కొద్దిగా ఉప్పు వేయాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత, పాస్తాను ఒక నిమిషం వరకు ఉడికించి తీస్తే చాలు.
  • డబ్బాల మూతలు తీయడం ఒక్కోసారి చాలా టైమ్ పడుతుంది. ఈ విషయంలో ఎవరి చిట్కాలు వాళ్లకుంటాయి. అయితే, సింపుల్​గా మరో చిట్కా ఉంది. ఒక టీ స్పూన్​ను, జార్‌‌కు, మూతకు మధ్య ఉంచి తిప్పితే, మూత ఎంత టైట్​గా ఉన్నా సరే ఈజీగా వస్తుంది.
  • కొన్నిసార్లు బ్రెడ్‌ త్వరగా పాడవుతుంది. బ్రెడ్‌ పాడవకుండా ఉండాలంటే ఫ్రీజర్‌‌లో స్టోర్‌‌ చేసుకోవాలి. అవసరమైనప్పుడు బయటకు తీసి, మైక్రోఒవెన్‌లో వేడి చేసుకుంటే సరిపోతుంది.
  • ఇంట్లో మైక్రోఒవెన్‌ ఉన్నవాళ్లు బేకరి ఐటమ్స్‌ ఎక్కువగా తెచ్చుకుంటారు. అవసరమైనప్పుడు వాటిని వేడి చేసుకుని తింటారు. కానీ, ఇలా వేడిచేస్తే ఐటమ్స్‌ డ్రై అవుతాయి. అలా కాకుండా ఉండాలంటే... వేడి చేయాలనుకున్న ఐటమ్​తో పాటు ఒవెన్‌లో ఒక కప్పు నీళ్లు కూడా పెట్టాలి.

Tagged cooking, work from home, work tension, curries, kitchen tips, Womens work from home

Latest Videos

Subscribe Now

More News