వచ్చే ఏడాది నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్

వచ్చే ఏడాది నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్
  • సంక్రాంతి తర్వాత 70 శాతం ఎంప్లాయీస్​ను రప్పించేందుకు ఐటీ కంపెనీల చర్యలు
  • ప్రస్తుతం 40 శాతం మందితోనే వర్క్
  • డిసెంబర్ వరకు కొనసాగనున్న రోటేషన్ సిస్టమ్ 

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది వరకు రోటేషన్, షిఫ్ట్ సిస్టమ్​లోనే ఐటీ సెక్టార్ నడవనుంది. కరోనా ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ తో గతేడాది మార్చిలో ఐటీ కంపెనీలు 
ఎంప్లాయీస్​కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. కరోనా తీవ్రత తగ్గడంతో  ఈ ఏడాది ఫిబ్రవరిలో 7 నుంచి 12శాతం ఎంప్లాయీస్ తో ఐటీ కంపెనీలు ఓపెన్ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్​లో సెకండ్ వేవ్ తీవ్రత పెరగడంతో మరోసారి కంపెనీలు క్లోజ్ అయ్యాయి. 3 నెలలుగా అన్ లాక్ ఉండటం, కరోనా ఎఫెక్ట్ కూడా తగ్గడంతో ఇంపార్టెంట్ రోల్స్ లో ఎంప్లాయీస్​తో కంపెనీలు మళ్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీసును మొదలుపెట్టాయి. మెల్లమెల్లగా ఆఫీసుకు వచ్చి పనిచేసే ఎంప్లాయీస్ సంఖ్యను పెంచుతూ వస్తున్నాయి. ఓవైపు ఎంప్లాయీస్ కు వ్యాక్సినేషన్ చేయిస్తూనే  వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ఐటీ కంపెనీలు 40 శాతం ఉద్యోగులతో నడుస్తున్నాయి. అది కూడా టీమ్స్ షిఫ్ట్ వైజ్ సిస్టంతో కంటిన్యూ చేస్తున్నాయి. డిసెంబర్ చివరి వారం  వరకు ఇలాగే ఉంటుందని తెలంగాణా ఫెసిలిటీస్ మేనేజ్​మెంట్ కౌన్సిల్ చెప్తోంది. సంక్రాంతి తర్వాత 70 శాతం లేదా పూర్తి ఎంప్లాయీస్​తో కంపెనీలు రీ ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 

షిఫ్ట్ ల ప్రకారం.. 
ఐటీ కంపెనీల్లో వర్క్ చేసే ఎంప్లాయీస్​కు షిఫ్ట్ సిస్టం తప్పనిసరి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే వారితో పాటు నైట్ ఫిఫ్ట్స్ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు కూడా అదే సిస్టమ్​ను డిఫరెంట్​గా కంపెనీలు యూజ్ చేసుకుంటున్నాయి. ఒక కంపెనీలో 500 మంది ఎంప్లాయీస్ ఉంటే అందులో టీమ్స్ గా పని చేసే వారిని షిఫ్టింగ్ సిస్టంలో ఆఫీసులకు రప్పిస్తున్నాయి. రెండ్రోజులు ఒక టీమ్,  మూడ్రోజులు ఇంకో టీంతో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని కంపెనీల్లో ఇదే విధానం కొనసాగుతోంది. సొంతూళ్లకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్​నే కంటిన్యూ చేస్తున్నారు. ఎంఎన్‌‌సీల్లో 40 శాతం ఆక్యుపెన్సీతో పని జరుగుతుండగా.. చిన్న కంపెనీల్లో జూనియర్ స్టాఫ్​ను ఆఫీసులకు రమ్మని మేనేజ్​మెంట్లు చెప్తున్నాయి.  థర్డ్ వేవ్  లేకపోతే  వచ్చే ఏడాది జనవరి నుంచి 70 శాతం ఎంప్లాయీస్ ను ఆఫీసులకు రప్పిస్తామని కంపెనీల మేనేజ్​మెంట్లు అంటున్నాయి.  అప్పటిలోపు ఎంప్లాయీస్ రెండు డోసుల వ్యాక్సినేషన్ కూడా పూర్తవుతుందని భావిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఎంప్లాయీస్​లో ఎక్కువ మంది  ఆఫీసులకు వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొందరు మాత్రం పిల్లలకు వ్యాక్సినేషన్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్తున్నారు. తాము ఆఫీసులకు వెళ్లడం వల్ల  పిల్లలు ఎఫెక్ట్ అవుతారని భయపడుతున్నారు. డిసెంబర్ లోపు  పిల్లలకు వ్యాక్సినేషన్ అయితే టెన్షన్ ఫ్రీగా ఆఫీసులకు వెళ్లి పని చేసుకోవచ్చంటున్నారు.  దీంతో ఎంప్లాయీస్ కన్వినెంట్ ప్రకారమే కంపెనీల మేనేజ్ మెంట్లు వర్క్ ఫ్రమ్ ఆఫీసును  ప్లాన్ చేస్తున్నాయి.

దీపావళి తర్వాత సర్వే చేపడుతం
ప్రస్తుతం అన్ని కంపెనీలు ఓపెన్ అయ్యాయి. 30 నుంచి 40శాతం ఎంప్లాయీస్​తో హైబ్రిడ్ టీమ్ షిఫ్ట్ సిస్టంలో నడిపిస్తున్నాయి. దీపావళి తర్వాత ఒక అంచనా వస్తుంది. మెల్లమెల్లగా ఎంప్లాయీస్ శాతాన్ని పెంచొచ్చు. వచ్చే జనవరి నాటికి  ఎంప్లాయీస్ పర్సెంటేజ్​లో మార్పు వస్తుంది. 70 శాతం కానీ ఫుల్​గా కానీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయించొచ్చు. దీనిపై తెలంగాణా ఫెసిలిటీస్ మేనేజ్​మెంట్ కౌన్సిల్ (టీఎఫ్ఎంసీ) తరఫున వచ్చే నెలలో సర్వే చేయబోతున్నాం. 
- సత్యనారాయణ, అధ్యక్షుడు, టీఎఫ్ఎంసీ