
ఓ స్పానిష్ కేఫ్‌లో కూర్చుని సాయంత్రం కాఫీ తాగుతూ ఆఫీస్ వర్క్ చేయాలనీ మీరు ఎప్పుడైనా అనుకున్నారా.. అయితే స్పెయిన్ కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ నోమాడ్ వీసా మీ కలను నిజం చేయొచ్చు. ఈ వీసా యూరోపియన్ యూనియన్ కానీ పౌరుల కోసం తీసుకొచ్చారు. అంటే యూరోపియన్ దేశస్థులు కానివారు ఎవరైనా అర్హులు అని. ఇందుకు ఖర్చు కేవలం €75 అంటే సుమారు రూ.8,000 మాత్రమే. ఈ వీసా సహాయంతో ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువే స్పెయిన్‌లో ఉంటూ పనిచేయవచ్చు. కానీ దీనికో కండిషన్ ఉంది. ఈ వీసా పొందాలంటే మీ సంపాదనలో కనీసం 80% స్పెయిన్ బయటి నుండి రావాలి.
ఈ వీసాని స్పెయిన్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్టార్ట్-అప్ చట్టంలో ఒక భాగం. ఇంటర్నేషనల్ టాలెంట్, ప్రొఫెషనల్స్, రిమోట్‌గా పనిచేసే వారిని స్పెయిన్‌కు ఆకర్షించడమే దీని ఉద్దేశం. మీరు డెవలపర్, రైటర్, మార్కెటర్ లేదా ఫ్రీలాన్స్ కన్సల్టెంట్ అయితే ఇతర వర్క్ వీసాలతో పోలిస్తే యూరప్ వెళ్ళడానికి ఇదొక ఈజీ మార్గం.
ALSO READ : అమెరికా వెళ్లే కొత్త జంటలకు ఇప్పుడు అంత ఈజీ కాదు: వీసా రూల్స్ మార్పు..
మీకు ఈ వీసా కావాలంటే : మీరు EU (యూరోపియన్ యూనియన్) పౌరులు కాకూడదు. మీరు ఒక స్పానిష్ కంపెనీకి కాకుండా వేరే దేశ కంపెనీకి రిమోట్‌గా పనిచేస్తూ ఉండాలి. అలాగే, మీరు ఎక్కువగా అంతర్జాతీయ క్లయింట్‌లతో పనిచేసే ప్రొఫెషనల్ అయి ఉండాలి. మీ ఆదాయంలో కనీసం 80% స్పెయిన్ బయటి నుండి రావాలి. మీ క్లయింట్లు లేదా కంపెనీతో మీరు కనీసం మూడు నెలలగా పనిచేస్తున్నట్లు రుజువు చూపించాలి. మీ కంపెనీ లేదా మీరు చేస్తున్న ఫ్రీలాన్స్ వ్యాపారం కనీసం ఒక సంవత్సరం పైగా పనిచేస్తూ ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: మీరు ఈ వీసా కోసం మీ సొంత దేశం నుండి లేదా టూరిస్ట్ వీసాపై స్పెయిన్‌కు వెళ్లిన తర్వాత కూడా అప్లయ్ చేసుకోవచ్చు. మీరు రిమోట్‌గా పనిచేస్తున్నట్లు రుజువు ఉండాలి అలాగే మీకు ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు,
ఈ వీసా వల్ల ప్రయోజనాలు: ప్రపంచవ్యాప్తంగా రిమోట్ వర్క్ కల్చర్ పెరుగుతున్న కారణంగా స్పెయిన్ ప్రవేశపెట్టిన ఈ వీసా ఫ్రీలాన్సర్లు, డిజిటల్ నోమాడ్ల నుండి ఇప్పటికే మంచి స్పందన లభిస్తుంది.