అకారణంగా విధుల్లో నుంచి తొలగిస్తారా?

అకారణంగా విధుల్లో నుంచి తొలగిస్తారా?

వర్క్ ఇన్స్‌పెక్టర్‌‌ల నిరసన
గజ్వేల్: అకారణంగా విధుల్లో నుంచి తొలగించినందుకు వర్క్ ఇన్స్‌పెక్టర్‌‌లు నిరసనకు దిగిన ఘటన సిద్దిపేట జిల్లా, గజ్వేల్ మండలంలో జరిగింది. మండలంలోని కోమటి బండలో మిషన్ భగీరథ హెడ్ రెగ్యులేటరీ వద్ద వాటర్ ట్యాంక్ ఎక్కి సదరు వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌‌లు నిరసన తెలిపారు. ఎలాంటి కారణం లేకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా తమను విధుల్లో నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నుంచి ఎందుకు తొలగించాలని వారు ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని ప్లకార్డులతో నిరసన తెలిపారు.