జీడిమెట్ల, వెలుగు: కొబ్బరిచెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో ఓ కార్మికుడు చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. బీహార్‌కు చెందిన రాజ్‌కుమార్ (20) హైదరాబాద్‌కు వలస వచ్చి దూలపల్లిలో ఉంటూ స్థానికంగా గల ఓ కంపెనీలో లేబర్‌గా పనిచేస్తున్నాడు.
ఆదివారం కంపెనీ ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా కత్తి పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో షాక్ తగిలి చెట్టుపై నుంచి కిందపడి స్పాట్‌లోనే చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.