కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా కేకే ఓపెన్కాస్ట్ఓబీ పనులు చేపట్టిన ఆర్వీఆర్ కాంట్రాక్ట్ కంపెనీ కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ అన్నారు.
ఆదివారం మందమర్రిలోని ఏఐటీయూసీ యూనియన్ ఆఫీస్లో కేకే ఓసీపీ కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేండ్లుగా ఓబీ కాంట్రాక్ట్ కంపెనీ కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తూ వారికి వేతనాలు ఇవ్వలేదన్నారు. సింగరేణి ప్రకటించిన రూ.5,500 లాభాల వాటాను కార్మికులకు కూడా ఇవ్వకుండా సొంతంగా వాడుకుందని ఆరోపించారు.
సింగరేణి యాజమాన్యం జోక్యం చేసుకొని కాంట్రాక్ట్ కంపెనీ నుంచి కార్మికులకు రావాల్సిన వేతనాలు, లాభాల వాటాను ఇప్పించాలని డిమాండ్చేశారు. లేకపోతే కాంట్రాక్ట్ కంపెనీకి సింగరేణిలో కాంట్రాక్ట్రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ కంది శ్రీనివాస్, లీడర్లు జెట్టి మల్లయ్య, పి.బానయ్య, ఎం.వెంకటేశ్వర్లు, రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
