మిషన్ భగిరథ కార్మికుల మెరుపు సమ్మె.. 56 గ్రామాలకు నిలిచిన తాగునీరు

మిషన్ భగిరథ కార్మికుల మెరుపు సమ్మె.. 56  గ్రామాలకు నిలిచిన తాగునీరు

మక్తల్​, వెలుగు:  వేతనాలు చెల్లించకపోవడంతో మిషన్​ భగీరథ కార్మికులు మెరుపు సమ్మె చేశారు. దీంతో  మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాల్లోని ని  56 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. మంగళవారం అర్థరాత్రి  నుంచి సమ్మె బాట పట్టారు. జీతాలు చెల్లించేంత వరకు  నీటిని నిలిపివేస్తున్నట్లు కార్మికులు తెలిపారు. మక్తల్ మండలంలోని పారేవుల పంప్ హౌజ్ నుంచి మక్తల్, మాగనూరు, కృష్ణ మండలంలోని గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని సరఫర చేస్తున్నారు.  

ఈనెల 11న  సమ్మె చేసినపుడు వారం రోజుల్లో వేతనాలు చెల్లిస్తామని ఆర్​డబ్లూఎస్​ అధికారులు చెప్పినా ఇప్పటి వరకు చెల్లించ లేదన్నారు.  ఎమ్మెల్యే చెప్పినా కూడా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.  వేతనాలు చెల్లిస్తేనే సమ్మె విరమిస్తామన్నారు.  వారికి  ఐఎఫ్​టీయూ జిల్లా అధ్యక్షుడు  కిరణ్​ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో భుట్టో, నర్సింహ రెడ్డి, ఆంజనేయులు, రాజప్ప, మణివర్ధన్ రెడ్డి, లక్ష్మణ్ రావ్, మహేశ్​, అనంతయ్య, శ్రీనివాస శెట్టి. కార్మికులు పాల్గొన్నారు.