World AIDS Day : మీ HIV స్టేటస్ ఇలా తెలుసుకోండి.. పెళ్లికి ముందు జాగ్రత్త..!

World AIDS Day : మీ HIV స్టేటస్ ఇలా తెలుసుకోండి.. పెళ్లికి ముందు జాగ్రత్త..!

హెచ్‌ఐవీ ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. దీని బారిన పడినవారు నిరంతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. డిసెంబర్‌ ఒకటి.. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ నివారణకు ప్రపంచవ్యాప్తంగా  అందరూ హెచ్​ఐవీ టెస్ట్​ చేయించుకొని  స్టేటస్​ తెలుసుకోండి...

హెచ్ ఐవీ వైరస్ బారిన తమ దేశములను కాపాడేందుకు డిసెంబర్​ 1న  హెచ్ ఐవీ  టెస్టింగ్ డేని ప్రక టించింది. ఈ డేసందర్భంగా భారతదేశంలోని  పౌరులందరికీ హెచ్ఎప్ స్టేటస్ టెస్టులు చేయించుకోవాలి. . ఆరోగ్యవంతులని ఈ పరీక్షకు మినహాయింపు లేకుండా అందరూ పరీక్షలు వేయించుకోవడం ద్వారా ఎవరిలో ఈ వైరస్ ఉందో గుర్తిస్తారు. వైరస్ గుర్తించలేని స్థితిలో (పెండో స్టేజీ) ఉంటే మరుసటి ఏడాది నిర్వ హించే నేషనల్ హెచ్ఐవీ టెస్టింగ్ డే" నాడు పరీక్షలు చేస్తారు.  హెచ్ఐవీ పెరిగిపోవడానికి కారణం పాజిటివ్ వ్యక్తులు ఇతరులతో లైంగిక సంబంధాలు కలిగి ఉండటమే. ఈ వ్యక్తులకు తాము హెచ్​ఐ వీ పాజిటివ్ అని తెలియకపోవడం వల్లే వ్యాప్తి జరుగుతోందని గుర్తించి ప్రభుత్వమే అందరికీ ఏక కాలంలో పరీక్షలు నిర్వహించే విధానం ప్రవేశ పెట్టింది. . ఎయిడ్స్ నివారణకు ప్రచారం బాధితుల కోసం మందుల పంపిణీ. వారి సంక్షేమం కోసం చట్టాలు చేసిన భారత ప్రభు త్వం బారీ ప్రణాళికతో హెచ్ఐవీ వేగానికి కళ్లెం వేయాలని అనేక సంస్కరణలు చేపట్టింది..

పెండ్లికి ముందు జాగ్రత్త

తమ ఆరోగ్య స్థితిని తెలుసుకోవాలనుకున్నా ఏమనుకుంటారో?' అనే సందేహంతో హెచ్​ఐవీ ట్రై టెస్ట్​ కు ముందుకు  రావడం లేదు. ఈ టెస్ట్​ ను  వైద్యుల ప్రిస్క్రిప్షన్ సూచనలతోనే చేయించుకోవాలన్న నిబంధన ఏమీ లేదు. డయాగ్నస్టిక్ సెంటర్లో స్వయంగా, సంప్రదించి, హెచ్ఐవీ 1, హెచ్ఐవీ 2 పరీక్షలు చేయించుకోవచ్చు. 

పెళ్లి చూపుల్లో ఆర్థిక విషయాలే కాకుండా ఆరోగ్య విషయాలనూ మాట్లాడుకోవాలి. కాని ఆ అవసరాన్ని ఇప్పటికీ మన సమాజం ఆమోదించడం లేదు. పెళ్లికి ముందు అబ్బాయిలు చాలా మంది హెచ్ ఐవీ పరీక్ష కోసం ల్యాబ్​కు వస్తున్నారు. కానీ అమ్మాయిలను ఈ పరీక్షలు చేయించు కోమని చెప్పడానికి మాత్రం జంకుతున్నారు. 

 ఈ మొహమాటం హెచ్ ఐ వీ కన్నా ప్రమాదం.. హెచ్ఐవీ కేవలం చెడు తిరుగుళ్లు తిరిగే. వారికే వస్తుందనే అపోహ, హెచ్​ఐవీ పరీక్ష చేయించాలంటే చెడ్డవాళ్లు అనుకుంటారని కొత్త దంపతులు పరీక్షలకు వెనుకడుగు వేస్తున్నారు. కొత్తగా వివాహం చేసుకున్న జంటల్లో ఇలాంటి పరీక్షలకు సిద్ధమయ్యేవి ఒక్క శాతం కూడా ఉండటం లేదట.

ఇలాంటి విషయాల్లో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు  అని ఎన్నో ర్యాలీలు తీశారు. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో హెచ్ఐవీ సోకుతుంది.. జాగ్రత్త' అంటూ కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సెలబ్రిటీలతో చెప్పించి సామాన్యులకూ తెలిసేలా చేశారు. ఇంత చేసినా మన చుట్టూ హెచ్ఐవీ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ జబ్బుని నివారించాలంటే అందరూ హెచ్ఐవి  టెస్ట్​ చేయించుకొని స్టేటస్ తెలుసుకోవాలని వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్​ తెలిపింది.