మీకు వరల్డ్ కప్ టికెట్ కావాలా.. వెంటనే ఇలా రిజిస్టర్ చేసుకోండి

మీకు వరల్డ్ కప్ టికెట్ కావాలా.. వెంటనే ఇలా రిజిస్టర్ చేసుకోండి

వరల్డ్ కప్ మ్యాచ్‌ల టికెట్లకు సంబంధించి కీలక అప్‌డేట్ అందుతోంది. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకున్నవారు టికెట్ల బుకింగ్ కొరకు తమ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఐసీసీ సూచించింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి (ఆగస్టు 15) మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రారంభమయ్యింది. 

టికెట్ల విక్రయాలు ఆగష్టు 25 నుంచి మొదలుకానుండగా.. రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే వాటిని కొనుగోలు చేసే వీలుంటుంది. టికెట్లు కొనాలనుకుంటున్న వారు ముందుగా www.cricketworldcup.com/register వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం

  • ముందుగా https://www.cricketworldcup.com/register వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 
  • ఇప్పుడు మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ నమోదు చేయాలి. 
  • ఆపై మీరు ఏ దేశస్థులో ఎంచుకొని.. మీరు ఏ నగరంలో అయితే మ్యాచ్‌లు చూడాలనుకుంటున్నారో ఆ ప్రాంతాన్ని  ఎంపిక చేయండి. 
  • అనంతరం మీరు ఏ జట్టు మ్యాచ్‌లు చూడాలనుకుంటున్నారో ఎంపిక చేసుకొని.. సబ్మిట్(Submit) ఆప్షన్‌పై నొక్కండి. 
  • ఇప్పుడు మీరు విజయవంతంగా రిజిస్టర్ అయినట్లుగా మెసేజ్ డిస్ ప్లే అవుతుంది.

వరల్డ్ కప్‌లో టీమిండియా మినహా అన్ని దేశాల మ్యాచ్‌ల టికెట్లు ఆగష్టు 25 నుంచి అందుబాటులో ఉండనుండగా.. భారత్ ఆడే మ్యాచుల టికెట్లు దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి. అనగా మ్యాచ్‌ను బట్టి  ఆగష్టు 25, 30, 31తోపాటు సెప్టెంబరు 1, 2, 3, తేదీల్లో టికెట్లు బుక్ చేసుకోవాలి.