సిటీలో వరల్డ్​ కప్​ ఎఫెక్ట్.. వెలవెలబోయిన టూరిజం స్పాట్లు

సిటీలో వరల్డ్​ కప్​ ఎఫెక్ట్.. వెలవెలబోయిన టూరిజం స్పాట్లు

సిటీలో వరల్డ్​ కప్​ ఫైనల్​ మ్యాచ్ ఎఫెక్ట్ కనిపించింది.  సండే కావడంతో  సిటీవాసులు తమ ఇండ్లలోనే ఉండి మ్యాచ్ ను చూశారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు ఉండగా  మ్యాచ్​ ఎఫెక్ట్​ ప్రచారంపైనా పడింది.  చాలా మంది అభ్యర్థులు తమ ప్రచారాన్ని మధ్యాహ్నమే  ముగించారు. దీంతో అభ్యర్థుల ప్రచారాలతో హడావిడిగా ఉండే  సిటీ రోడ్లు ఖాళీగా కనిపించాయి.  అంబర్​పేట్​లో జరగాల్సిన రోడ్​షోను కేటీఆర్​ రద్దు చేసుకున్నారు. మల్కాజ్‌గిరి ప్రచారంలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డా బిగ్ ​స్ర్కీన్​పై క్రికెట్‌ను వీక్షించారు. 

ట్యాంక్​ బండ్​, నెక్లెస్ ​రోడ్​, ఎన్టీఆర్​ గార్డెన్​, లుంబినీ పార్క్‌ తదితర టూరిజం స్పాట్‌లు వెలవెలబోయాయి.  సినిమా థియేటర్లలో  ప్రేక్షకులు లేక ఖాళీగా దర్శనమిచ్చాయి. పెళ్లిళ్లు ఎక్కువగా ఉండగా ఫంక్షన్ హాళ్లలో బిగ్ స్ర్కీన్లను ఏర్పాటు చేసుకుని చూశారు. అదేవిధంగా​  వికారాబాద్ లో బరాత్ లో భాగంగా నూతన దంపతులు కారులో వెళ్తూ.. మ్యాచ్ ను వీక్షించారు.  వెలుగు, హైదరాబాద్​