
లార్డ్స్ : క్రికెట్ వరల్డ్ కప్ 2019ను లక్కీగా గెల్చుకున్న ఇంగ్లండ్… పసికూన ఐర్లండ్ ముందు బొక్కబోర్లా పడింది. గజిబిజి రూల్స్ లెక్కల్లో వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడి పదిరోజులు కాకముందే.. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఫ్లాప్ షో చేసింది. న్యూజీలాండ్ పై వరల్డ్ కప్ ఫైనల్ లో హోరాహోరీ పోరాడిన ఇంగ్లండ్.. టెస్టుల్లోకి వచ్చేసరికి.. పసికూన టీమ్ ఐర్లండ్ ముందు మోకరిల్లింది.
వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన లార్డ్స్ స్టేడియంలో ఈ ఉదయం ఇంగ్లండ్ , ఐర్లండ్ మధ్య ఏకైక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ తీసుకుంది. ఐతే.. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ వికెట్లు సైకిల్ స్టాండ్ లా టపటపా పడిపోయాయి. టాప్, మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. స్కోరు బోర్డుపై 8 రన్స్ ఉన్నప్పుడు తొలి వికెట్ సమర్పించుకున్న ఇంగ్లండ్… 43 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 42 రన్స్ ఉన్నప్పుడు కెప్టెన్ జో రూట్(2), బెయిర్ స్టో(0), వోక్స్ (0) ల 3 కీలక వికెట్లు పడ్డాయి. ఆ వెంటనే మొయిన్ ఆలీ కూడా డకౌటయ్యాడు. బర్న్స్ 6, రాయ్ 5, డెన్లీ 23, స్టువార్డ్ బ్రాడ్ 3 రన్స్ చేసి ఔటయ్యారు.
ఐర్లండ్ బౌలర్లలో టిమ్ ముర్తాడ్ ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. మార్క్ అదైర్ 2 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ పరువుకోసం పోరాడుతోంది.