మొక్కలు నాటాలి.. పర్యావరణాన్ని రక్షించాలి..

మొక్కలు నాటాలి.. పర్యావరణాన్ని రక్షించాలి..

నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, నల్గొండ, మెదక్​ జిల్లాల్లో పలుచోట్ల పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ శివారులో ఆక్సిజన్ పార్కులో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెదక్ ఎంపీ రఘునందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణం కాపాడే ప్రణాళికలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో 280 మహిళా సంఘాలకు 13 రకాల స్టీల్ వస్తువులు పంపిణీ చేసి స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేశామన్నారు. నారాయణపేట జిల్లా సింగారం చౌరస్తా సమీపంలో జరిగిన కార్యక్రమంలో మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ ఎంపీ డీకే అరుణ మొక్కలు నాటి మాట్లాడారు. 

వనపర్తి జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రమాకాంత్ మొక్కను నాటి, గ్లోబల్ వార్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. భెల్​ రామచంద్రాపురం యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈడీ శ్రీనివాస రావు ఉద్యోగులు, కార్మికులు గ్రీన్​ ర్యాలీ నిర్వహించారు. మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్బన్ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టూరిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూపొందించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. రామాయంపేట మండలం అక్కన్నపేట వనయోజన అటవీ పార్క్​లో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్​ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ రత్నాకర్, డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో జోజీ, డీఆర్​డీవో శ్రీనివాసరావు పాల్గొని మొక్కలు నాటారు. పలుచోట్ల పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.