సంక్షోభాలతో ప్రపంచం సతమతం.. యూఎన్డీపీ షాకింగ్ రిపోర్ట్

సంక్షోభాలతో ప్రపంచం సతమతం.. యూఎన్డీపీ షాకింగ్ రిపోర్ట్

ఇరాన్ యుద్ధం, అధిక వడ్డీ రేట్లు, ఎల్ నినోతో తీవ్ర ఇబ్బందులు 

ఆయిల్ ధరలను కంట్రోల్లో ఉంచేందుకు ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీల విలువ రూ.95 లక్షల కోట్లు
 

న్యూఢిల్లీ:  ప్రస్తుత ప్రపంచం మూడు తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొంటోంది. అమెరికా–ఇరాన్ యుద్ధంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరగగా, వివిధ దేశాల్లో  వడ్డీ రేట్లు గరిష్టాలకు చేరడంతో  ప్రభుత్వాల అప్పులు కూడా రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  చేరాయి. మరోవైపు ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నినో  దెబ్బకు ఆహార కొరత ఏర్పడుతుందనే భయాలు  ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులకు మద్ధతుగా ఉండేందుకు చాలా దేశాలు  ఇంధనాలపై పన్నులు తగ్గించడం,  ప్రజలకు సబ్సిడీలు ఇవ్వడం,  ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండేందుకు ధరలపై పరిమితులు పెట్టడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి.  

ఆయిల్ ధరలను కంట్రోల్లో ఉంచేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు ఈ ఒక్క ఏడాదిలోనే రూ.95 లక్షల కోట్ల విలువైన రాయితీలను ఇచ్చాయని  యూనైటెడ్ నేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (యూఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీపీ) తన తాజా రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. దీనినిబట్టి పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా మారాయో తెలుస్తోంది. 

ఒకేసారి మూడు ముప్పులు

    ఇరాన్ యుద్ధం కారణంగా బ్యారెల్ ముడి చమురు ధర  100 డాలర్లను దాటింది. దీంతో  ప్రపంచవ్యాప్తంగా రవాణా, నిత్యావసరాల ఖర్చులు గణనీయంగా పెరిగిపోయాయి. 

      అమెరికా వంటి దేశాల్లో  వడ్డీ రేట్లు ఇంకా గరిష్టాల్లో ఉండడంతో ఈ దేశాల అప్పులు కూడా అంతే స్థాయిలో పేరుకుపోతున్నాయి. ఒక్క అమెరికా అప్పే 40 ట్రిలియన్ డాలర్లకు చేరిందని అంచనా. చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రభుత్వాలు  అధిక వడ్డీలకు అప్పులు చేసి  ప్రజలకు సబ్సిడీలు ఇస్తున్నాయి. దీంతో వీటిపై ఆర్థిక భారం పెరుగుతోంది. 

     ఎల్‌‌ నినో కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయాయి. కరువులు, అకాల వరదలు సంభవించి ఆహార ఉత్పత్తి పడిపోయే ప్రమాదం ఉంది. చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఎల్ నినోగా ఇది మారే ప్రమాదం ఉంది.

సబ్సిడీలు లేకపోతే 13 కోట్ల మంది పేదరికంలోకి.. 

 యుద్ధ ప్రభావం పెరిగిన తర్వాత అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ధరలపై పరిమితులు , పన్ను తగ్గింపులు, రాయితీలు ప్రకటించిన దేశాల సంఖ్య రెట్టింపైందని యూఎన్‌‌డీపీ పేర్కొంది. ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకోకపోయి ఉంటే  ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల  మంది   పేదరికంలోకి వెళ్లిపోయేవారని స్పష్టం చేసింది. వీరి రోజువారి సంపాదన రూ.570 కంటే తక్కువగా ఉంది.

ఇంధన, ఆహార ధరలు పెరగడం  వల్ల సెప్టెంబర్‌‌‌‌లో సిరియా, గ్వాటెమాలా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, పోర్చుగల్ సహా కనీసం 10 దేశాల్లో తీవ్ర నిరసనలు, ప్రజాందోళనలు చెలరేగాయి.  ఈ సంక్షోభాల ఉమ్మడి ప్రభావం 2027 ప్రారంభంలో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, అసలైన గడ్డుకాలం మున్ముందే ఉందని యూఎన్‌‌డీపీ వెల్లడించింది.

ప్రజలకు మద్ధతుగా చర్యలు తీసుకున్న దేశాల సంఖ్య 

ఇంధనాలపై ట్యాక్స్ తగ్గించడం    ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  35 దేశాలు    సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 57 దేశాలు

సబ్సిడీలు ఇవ్వడం    13     38

ధరలపై పరిమితులు పెట్టడం    13     23