- 3 నుంచి 18 ఏండ్ల లోపు వారు అర్హులు
గచ్చిబౌలి, వెలుగు : ఫిబ్రవరి 1 నుంచి గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వద్ద వరల్డ్ జూనియర్ 10 కే రన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను సోమవారం బొటానికల్ గార్డెన్స్‌లో ఆసియా క్రీడల మెడలిస్ట్, అథ్లెట్ అగసర నందిని ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో తొలిసారిగా పిల్లల కోసం టైమ్డ్ రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచేందుకు ఈ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ రన్లో భాగస్వాములను చేయాలని సూచించారు. స్పాట్‌ఆన్ సంస్థ సీఈవో రోహిత్ మిశ్రా మాట్లాడుతూ అండర్–-3 నుంచి అండర్-–18 వయసు గల పిల్లలు ఈ రన్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి గల వారు 97040 26666 నంబర్‌కు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. కార్యక్రమంలో బొటానికల్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా భరత్ రెడ్డి, రన్ క్యూరేటర్ రుచిశర్మ తదితరులు పాల్గొన్నారు.
