కరోనాను అడ్డుకోవడంలో వరల్డ్‌ లీడర్‌‌షిప్‌ ఫెయిల్

కరోనాను అడ్డుకోవడంలో వరల్డ్‌ లీడర్‌‌షిప్‌ ఫెయిల్

కరోనాను అడ్డుకోవడంలో వరల్డ్‌ లీడర్‌‌షిప్‌ ఫెయిల్ అయిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్రావు అన్నారు. ‘కరోనా క్రైసిస్‌ ‌‌‌టైమ్‌‌‌‌లో వరల్డ్‌ ‌‌‌లీడర్‌‌‌‌షిప్ ప్రజలను నిరాశపరిచిందనడంలో ఎలాంటి డౌట్‌‌‌‌లేదు. ఊహించని ఈ పెనుముప్పును కంట్రోల్‌‌‌‌చేయడంలో అమెరికా లీడర్‌‌‌‌షిప్‌‌‌‌లోని దేశాలు ఎంత నిరక్ష్ల్యంగా, అసమర్థంగా వ్యవహరించాయో క్లియర్‌‌‌‌గా తెలుస్తోంది. ఇది అంతర్జాతీయ నాయకత్వపు హిస్టారికల్‌ ‌‌‌క్రైసిస్‌‌‌‌. ఫినాన్స్‌‌‌‌, సోషల్‌‌‌‌, పొలిటికల్‌‌‌‌, ఆర్మీపరంగా తాము గొప్ప అని చెప్పుకునే దేశాల్లో తీవ్ర వేదన, రోజు రోజుకూ పెరుగుతున్న మరణాలను చూస్తుంటే ముందుచూపు కొరవడిందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఫస్ట్‌‌‌‌కేసు గుర్తించగానే కరోనా వ్యాప్తిని అరికట్టేచర్యలు చేపట్టకపోవడం ఈ ఫెయిల్యూర్‌‌‌‌కు ప్రధాన కారణం. అభివృద్ధి చెందామంటూ చెప్పుకునే డెమొక్రటిక్‌ ‌‌‌దేశాల్లో పాలనాపరమైన, వ్యవస్థాగతమైన లోపాల లిస్ట్‌‌‌‌ చాంతాడంత ఉంది. వీటిని అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పేందుకు ఫాలో అవుతున్న విధానాల్లోనే లోపాలున్నట్టు నేను భావిస్తున్నాను. దురదృష్టవశాత్తు, వారి నాయకత్వలేమిని ఇప్పుడు ఎవరూ వేలెత్తి చూపడం లేదు’ అని ఆయన అన్నారు.

పాలనకంటే పాలిటిక్స్‌‌కు పెద్దపీట
చాలా దేశాల్లో పరిపాలనను రాజకీయాలు ఓవర్‌‌‌‌కమ్‌ ‌‌‌చేశాయి. ఎన్నికలు లేని టైంలో కూడా మంచి పాలన అందివ్వడం వదిలి రాజకీయాలు చేయడం అంతటా కామన్‌‌‌ ‌అయిపోయింది. ప్రతిదానిపై ఈ ఎఫెక్ట్‌‌‌‌ పడుతోంది. కరోనా లాంటి క్రిటికల్‌‌‌‌ టైంలో దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడేందుకు సమగ్ర వ్యూహం రూపొందించే విజన్‌‌‌‌ లేకపోవడం దీనికి ఉదాహరణ. ప్రపంచ దేశాలు వారి దగ్గర కరోనా సోకినప్పుడు సకాలంలో రెస్పాండ్‌‌‌‌ అవకుండా రాజకీయాల్లో మునిగితేలుతూ ప్రజలను పెద్ద క్రైసిస్‌‌‌‌లోకి నెట్టేశాయి. ఈ మహమ్మారిని కంట్రోల్‌‌‌‌ చేసేందుకు ఒక్కటిగా ప్రయత్నించకుండా నాలుగైదు వారాలపాటు డైలమా కొనసాగించాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవాలి.. అధికారాన్ని
దక్కిం చుకోవాలనే అజెండాతో చాలా దేశాల నాయకులు తమ ప్రజలను వారిమానాన వారిని వదిలేశారు. దానికి ఇప్పుడు ఆ దేశాలు భారీ మూల్యం చెల్లిస్తున్నాయి.

సోషల్‌‌/ఫినాన్షియల్‌ గ్యాప్స్‌
200 నుంచి 500 ఏండ్లుగా ఆరనైజ్డ్ ‌‌‌అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ ఉందని చెప్పుకునే దేశాల్లో కూడా సరైన సోషల్‌‌‌‌బ్యాలెన్స్‌‌‌‌, అన్ని వర్గాల్లో కలుపుగోలుతనం, ఆర్థిక భద్రత ఇప్పటికీ కనిపించడం లేదు. అవన్నీ ఉండి ఉంటే ఈ క్రిటికల్‌ ‌‌‌టైంలో కొంత రిలీఫ్‌ ‌‌‌ఉండేది. వరల్డ్‌‌‌‌ వైడ్‌‌‌‌గా లాక్‌‌‌‌డౌన్ విజయవంతంగా సాగేది. పేదల రోజువారి అవసరాలు, దేశ ప్రయోజనాలకంటే మత విశ్వాసాలకు ఇంపార్టెన్ర్టెస్ ఇవ్వడం, సరైన విద్య, శక్తిమంతమైన హెల్త్‌ ‌‌‌ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ లేమి, ఫీల్డ్‌‌‌‌లెవల్‌‌‌‌లో పనిచేసే హెల్త్‌‌‌ ‌సిబ్బందికి సరైన పర్సనల్‌ ‌‌‌ప్రొటెక్షన్‌ ‌ఎక్విప్‌మెంట్ ‌‌‌‌(పీపీఈ) అందుబాటులో లేకపోవడం,
మెడిసిన్‌ ‌‌‌కొరత వంటివి డెవలప్‌మెంట్‌‌‌‌లో గ్యాప్స్‌‌‌‌ ని తెలియజేస్తున్నాయి.

లీడర్‌‌షిప్‌‌ను రీడిఫైన్‌ ‌చేయాల్సిన టైం
ప్రపంచానికి పెద్ద సవాల్ కరోనా. తెలియకుండానే ప్రోగ్రామింగ్ చేయబడిన మెషీన్లలా బతుకున్న మానవజాతికి ఇది హిస్టారికల్‌ ‌‌‌డిస్‌‌‌‌రప్షనే? ఈ ఇబ్బందికర పరిస్థితులను ఒక చాన్స్‌‌‌‌గా మార్చుకోవాలని నేను గట్టిగా నమ్ముతున్నా. ఓసారి రీసెట్ బటన్ నొక్కి ఈ అందమైన గ్రహంపై తామున్న ఉద్దేశాన్నిమనుషులు గుర్తించాలి. ఈ క్రైసిస్‌ ‌‌‌ముగిసిన తర్వాత మనకు కొత్త మార్గం లభిస్తుంది. అప్పుడు కొత్త ప్రపంచం కోసం మనం నాయకత్వాన్ని రీడిఫైన్‌ ‌‌‌చేద్దాం. ప్రతీదీ మనుషుల కంట్రోల్‌‌‌‌లో ఉంటుందని చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఎవరు ఎవరిని కంట్రోల్‌‌‌‌ చేస్తున్నారో
అర్థంకాక కన్‌‌‌‌ఫ్యూజ్‌ ‌‌‌అవుతూ ఓ రకమైన షాక్‌‌‌‌లో ఉన్నారు. తరాలుగా మనం ఈ అబద్ధాన్ని చెప్తున్నాం, ఇప్పుడు కంట్రోల్‌‌‌‌ చేయలేక మన చేతగానితనాన్ని చాటుకుంటున్నాం. కొత్త వరల్డ్‌‌‌‌ లీడర్‌‌‌‌షిప్‌ గొప్పవిజన్‌‌‌‌తో ఉండాలనే నేను కోరుకుంటున్నాను. ఆ నాయకత్వం
బలహీనులు, పేదలపై జాలితో ఉండాలి. సోషల్‌‌‌‌, ఫినాన్షియనాన్షిల్‌ ‌‌‌ఈక్వాలిటీ కోసం రీడిఫైన్‌ ‌‌‌చేసుకునే కొత్త లీడర్‌‌‌‌షిప్‌ కృషి చేయాలి.

పాఠాలు నేర్చుకోలే
కరోనా మహమ్మారి మొదటి కాదు, చివరిది కాబోదు. గతం నుంచి పాఠాలు నేర్చుకొని, ఆ పొరపాట్లు రిపీట్‌‌‌‌కాకుండా చూడటమన్నది
లీడర్‌‌‌‌షిప్‌ లక్షణం. గతంలోనూ ఎన్నో మహమ్మారులు ప్రపంచాన్ని షేక్‌‌‌‌ చేశాయి.
కలరా: 1910 నుంచి 1911
మరణాలు: 8,00,000+

ఇన్‌‌ఫ్లూయెంజా ఫ్లూ: 1918
మరణాలు: 20 -నుంచి 50 మిలియన్లు

ఇన్‌‌ఫ్లూయెంజా ఏషియన్ ఫ్లూ: 1956-58
మరణాలు: 2 మిలియన్లు

ఇన్‌‌ఫ్లూయెంజాఫ్లూ: 1968
మరణాలు: 1 మిలియన్

హెచ్ఐవీ/ఎయిడ్స్: 2005- నుంచి 2012
మరణాలు: 36 మిలియన్లు

గతంలో లక్షల మందిని బలితీసుకున్న ఈ మహమ్మారుల చరిత్ర నుంచి వరల్డ్ లీడర్‌‌‌‌షిప్‌ పాఠాలు నేర్చుకుని ఉంటే కరోనాను ఎదుర్కొనేందుకు దేశాలన్నీ రెడీగా ఉండేవి. ఇప్పటి పరిస్థితి చూస్తే వీటి నుంచి ఆ దేశాలు ఏం నేర్చుకోలేదన్నది అర్థమవుతోంది.

వైరస్ ఎటాక్ తప్పించుకోలేకపోతున్నరు
రోజూ వేలమందిని బలితీసుకుంటున్నవైరస్‌‌‌‌ను కట్టడి చేయలేనప్పుడు ప్రపంచంలో ఉన్న సైనిక శక్తి అంతా ఒక్కటైనా వచ్చే ప్రయోజనం
ఏముంది? వైరస్‌‌‌‌ మానవ మనుగడకు సవాల్ విసురుతున్న టైమ్‌‌‌‌లో మిసైల్స్‌‌‌‌, డిఫెన్స్‌‌‌‌ పరికరాల కోసం ఏటా బడ్జెట్ లో వేలకోట్లు కేటాయిస్తే ఏం
ప్రయోజనం? ఆ దేశాలు డిఫెన్స్‌‌‌‌కు కేటాయించిన మొత్తంలో కొంత హాస్పిటళ్ల నిర్మాణం, ఎమర్జెన్సీ ఎక్విప్‌మెంట్‌‌ ‌‌కొనుగోలుకు, పెద్ద సంఖ్యలో డాక్టర్లు, హెల్త్‌‌‌‌సిబ్బంది నియామకం కోసం, రీసెర్చ్‌‌‌‌ కోసం ఖర్చు చేయాలి.

For More News..

కరోనా చెత్తను ఎలా పడేయాలో తెలుసా..

టైంపాసుకు రోడ్డెక్కితే.. పట్టేస్తది

అటు కరోనా.. ఇటు అకాల వర్షాలు.. రైతన్నకు కోలుకోలేని దెబ్బ