అట్లాంటా ఎయిర్ పోర్ట్.. వరల్డ్‌లోనే నంబర్ వన్

అట్లాంటా ఎయిర్ పోర్ట్.. వరల్డ్‌లోనే నంబర్ వన్

ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే ఎయిర్ పోర్ట్ ఏదో తెలుసా? అమెరికాలోని హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఎయిర్ పోర్ట్. గత ఏడాది మొత్తం10.7 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలతో ఈ ఎయిర్ పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్ పోర్ట్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. వరుసగా 21వ ఏడాది వరల్డ్ నెం.1గా నిలవడం మరో విశేషం. ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ 2018కి గానూ  వరల్డ్ ట్రాఫిక్ రిపోర్ట్ ను సోమవారం విడుదల చేసింది. ఇందులో ఇండియా నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరల్డ్ నెం. 12గా నిలిచింది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ద్వారా  గత ఏడాది 6.99 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు రిపోర్ట్ వెల్లడించింది. ఇక ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి అవుతున్న 30 విమానాశ్రయాల్లో 12 ఇండియా, చైనాలోనే ఉన్నాయి. ఈ లిస్టులో బెంగళూర్ ఎయిర్ పోర్ట్ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది అక్కడి నుంచి 3.23 కోట్ల మంది ప్రయాణించారు.