- దేశంలో 40 శాతానికి చేరిన రికవరీ రేటు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి వేగాన్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయగలిగామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచ సగటుతో పోలిస్తే మన దేశంలో ఇన్ఫెక్షన్, డెత్ రేటు చాలా తక్కువగా ఉందని తెలిపింది. కరోనా బారినపడిన వారి రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ఇది ఆశాజనకమైన ఫలితమని చెప్పింది. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 1,06,750 మందికి కరోనా సోకిందని, అందులో 3,303 మంది మరణించారని తెలిపారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకుని 42,298 మంది డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 61,149 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి లక్షకు 62 మందికి కరోనా..
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ప్రతి లక్ష మందిలో 62 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. అయితే ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్ లో ఈ సంఖ్య చాలా తక్కువ అన్నారు. దేశంలో లక్ష మంది జనాభాలో 7.9 మందికి కరోనా సోకినట్లు చెప్పారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా లక్షమందిలో 4.2 మంది కరోనాతో మరణించగా.. భారత్ లో ఆ సంఖ్య 0.2గా ఉందని తెలిపారు.
7.1 శాతం నుంచి 39.62 శాతానికి రికవరీ రేటు
దేశంలో లాక్ డౌన్ మొదటి దశ స్టార్ట్ అయినప్పుడు కరోనా పేషెంట్ల రికవరీ రేటు 7.1 శాతం ఉందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్. రెండో దశ లాక్ డౌన్ లో రికవరీ రేటు 11.42 శాతానికి, ఆ తర్వాత ఫేజ్ లో 26.59 శాతానికి చేరిందన్నారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 39.62 శాతానికి చేరినట్లు తెలిపారు.
4.2 people per lakh population across the world have died due to #COVID19. In India it is 0.2 deaths per lakh population: Lav Agarwal, Union Health ministry joint secretary https://t.co/SOarbZrQ3h
— ANI (@ANI) May 20, 2020
