
గూగుల్ ప్లే స్టోర్ సర్వీస్ లు స్థంభించాయి. మంగళవారం (ఏప్రిల్25) ప్రపంచ వ్యాప్తంగా చాలామంది యూజర్లకు ప్లే స్టోర్ కొంతసేపు పని చేయలేదు. దీంతో ఆండ్రాయిడ్ యూజర్లంతా.. గూగుల్ ప్లే స్టోర్ సర్వర్ డౌన్ అయినట్లు ట్విటర్ లో ఫిర్యాదులు చేస్తున్నారు.
ప్లే స్టోర్ లో సెర్చ్ చేస్తుంటే ‘something went Wrong’ అని వస్తున్నట్లు ట్వీట్స్ చేస్తున్నారు. అయితే, వినియోగదారులు లేవనెత్తిన సమస్యపై గూగుల్ ఇప్పటివరకు స్పందించలేదు. సర్వర్ డౌన్ అవడానికి గల కారణాన్ని వివరించలేదు. కాగా.. కొద్దిసేపటికే గూగుల్ తిరిగి తన సేవలు పునరుద్ధరించినట్లు తెలుస్తోంది.