ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు ఎయిడ్స్ నివారణ ప్రాధాన్యతను తెలియజెప్పేందుకు డిసెంబరు 1వ తేదీన వరల్డ్ ఎయిడ్స్ డే'ని నిర్వహిస్తారు. తొలిసారిగా 1988లో ఎయిడ్స్ డే'ని పాటించారు. ప్రతిఏడాది ఒక నినాదంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎయిడ్స్ డే జరపాలని పిలుపునిస్తోంది. ఈ ఏడాది ( 2025) 2030 నాటికి కొత్త ఎయిడ్స్ కేసులను అంతం చేద్దాం.. అనే నినాదంతో హెచ్ ఐ వీ పరీక్షతో మీ స్టేటస్ తెలుసుకోండి .. . !
అవగాహన, నివారణ కోసం కాచ్చే ఆ నినాదంలోని విధానాన్ని ఏడాదికాలం అమలుచేస్తూ హెచ్ఐవీ నివారణకు ఉద్యమించాలని సూచిస్తోంది. కొన్ని దశాబ్దాల నుంచి ఎయిడ్స్ వ్యతిరేక పోరాటం సాధించింది ఏమిటని చూస్తే 2025 నాటికి 25 లక్షల హెచ్ఐవీ కేసులు ఇండియాలో నమోదయ్యాయి. 2024 ఒక్క ఏడాదిలోనే 68 వేల 450 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. 2010 సంవత్సరంతో పోల్చితే కొత్త హెచ్ఐవీ కేసుల నమోదులో 44 శాతం తగ్గుదల నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే.. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసుల నమోదును సున్నాకు తీసుకురావాలనే లక్ష్యంగా.. 2025 డిసెంబర్ 1వ తేదీ ప్రపంచ ఎయిడ్స్ డే నినాదం అయ్యింది.
వైరస్ సోకినా ఆ విషయం తెలియని అమాయకులెం దరో ఇంకా ఉన్నారు. రక్తదానం, ఇతర అనారో గ్యంతో దవాఖానకు పోయినప్పుడు నిర్వహిం చేపరీక్షలు, గర్భం దాల్చినప్పుడు, ఆపరేషన్ల కోసం చేసే రక్త పరీక్షలప్పుడు మాత్రమే ఈ ప్రాణాంతక వైరస్ గుర్తిస్తున్నారు. ఇలా గు ర్తించినవే ఈ లెక్కలన్నీ పులిరాజుకు ఎయిడ్స్ వస్తుందా? అన్నమాటే కానీ ఎయిడ్స్ సోకిన వాళ్లను గుర్తించే పని జరగలేదు.
అమ్మపాలు అమృతమేనా?
మన దేశంలో హెచ్ఐవీ వ్యాప్తికి ప్రధాన మైన ఆరు కారణాల్లో ప్రధానమైనది సురక్షితం కాని లైంగిక సంబంధాలే ఒకప్పుడు హెచ్ఐవీ వ్యభిచార వృత్తిలో ఉన్న వారికే సోకుతుందని భావించేవాళ్లు తొలినాళ్లలో బాధితులు వాళ్లే ఎక్కువ. కానీ ఈ వైరస్ పట్ల అవగాహన, అప్రమత్తత పల్ల ఇప్పుడా పరిస్థితి లేదు. కానీ మాకు రాదనే నిర్లక్ష్యం తో ఇతరులతో లైంగిక సంబంధాలు కలిగి ఉండేవాళ్లు భావిస్తున్నారు. ఈ సంబంధాల ద్వారా వ్యాప్తిచెందుతున్న వైరస్ తర్వాత జీవిత భాగస్వామికి సోకుతుంది.
మన దేశంలో హెచ్ఐవీ బాధితుల్లో 5 శాతం మంది తల్లిపాల ద్వారా హెచ్ ఐ వీ బాధితు లయ్యారు. గర్భం దాల్చినప్పుడు, డెలివరీ సమయంలో హెచ్ఐవీ నెగటివ్ రిపోర్ట్ వున్నతల్లులు ఆరేడు నెలల్లో హెచ్ఐవీ బాధితులు కావడం, అభంశుభం తెలియని పిల్లలు వైరస్ బారిన పడడం ఆందోళన కలిగించే విషయం. భార్యలు గర్భవతిగా ఉన్న సమయంలో, డెలివర్ అయిన తొలి మూడు నెలలు భర్తలు ఆమెకు దూరంగా ఉంటారు.
ఈ కాలంలో లైంగిక కోర్కెలు తీర్చుకునేందుకు పరిచయస్తులతో సంబంధాలు ఏర్పరచుకుంటారు. హెచ్ఐవీ గురించి, జాగ్రత్తలు తెలిసినా అదంతా వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్లకోసమే అన్నట్లుగా నిర్లక్ష్యం చేస్తున్నా రు. ఈ నిర్లక్ష్యం జీవిత భాగస్వామిని, బిడ్డ ల్ని బలిపెడుతోంది. ఈ దేశంలో తల్లిపాల ద్వారా హెచ్ఐవీ బారినపడ్డ చిన్నారులు లక్ష మందికి పైగానే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి అమ్మపాలు అమృతమేదా? ఈ రోగానికి కారణం హెచ్ఐవీ కాదు. పెద్దల నిర్లక్ష్యమేనని నిపుణులు అంటున్నారు.
