ప్రపంచంలోనే హయ్యెస్ట్ టెంపరేచర్ రికార్డ్

ప్రపంచంలోనే హయ్యెస్ట్ టెంపరేచర్ రికార్డ్

అమెరికాలో 54.4 డిగ్రీలు నమోదు
భూమిపైనే అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డు?
కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో నమోదు

కాలిఫోర్నియా: డెత్ వ్యాలీ.. పేరుకు తగ్గట్లే ఉంటుంది ఆ ప్రాంతం. వేడి మామూలుగా ఉండదు. మండే ఎండ ఉంటుంది. మన దగ్గర ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరితేనే వామ్మో అంటాం. అట్లాంటిది అక్కడ ఎండా కాలంలో 50 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. తాజాగా ఆదివారం 54.4 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. అమెరికాలోని కాలిఫోర్నియా -నెవాడా మధ్య ఉంది డెత్ వ్యాలీ.

ఇదే అత్యధికం?
డెత్ వ్యాలీలో తాజాగా నమోదైన 54.4 డిగ్రీల టెంపరేచర్.. భూమిపైనే అత్యధికమని అంటున్నారు. నిజానికి 1913 జులై 10న డెత్ వ్యాలీలోనే రికార్డుస్థాయిలో 56.7 డిగ్రీల సెల్సియస్ (134 డిగ్రీల ఫారెన్‌‌‌‌ హీట్) నమోదైంది. ఇప్పటిదాకా భూమిపై ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని చెబుతున్నా.. అది వివాదాస్పదంగానే ఉంది. నాటి ఉష్ణోగ్రతలను మోడర్న్ వెదర్ ఎక్స్ పర్టులు తప్పుగా అంచనా వేశారన్న అభిప్రాయం ఉంది. వెదర్ హిస్టోరియన్ క్రిస్టొఫర్ బర్ట్ 2016లో జరిపిన అనాలిసిస్ ప్రకారం.. 1913లో మిగతా ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు డెత్ వ్యాలీ రీడింగ్ లను నిర్ధారించడం లేదు. 1931లో ట్యునీషియాలో 55 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. కాని బర్ట్ దీన్ని కూడా నిర్ధారించలేదు. వలస రాజ్యాల కాలంలో ఆఫ్రికాలో నమోదైన ఈ ఉష్ణోగ్రతలను కచ్చితంగా నమ్మలేమని అభిప్రాయపడ్డారు. అ తర్వాత 2013లో డెత్ వ్యాలీలోనే నమోదైన 54 డిగ్రీలు.. భూమిపై విశ్వసనీయంగా నమోదైన అత్యధిక టెంపరేచర్లుగా రికార్డులకు కెక్కాయి. తాజాగా డెత్ వ్యాలీ తన రికార్డును తానే బద్దలు కొట్టింది.

మరింత పెరుగుతయంట
డెత్ వ్యాలీ అత్యంత పొడి ప్రదేశం. వేసవిలో ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడి ఫర్నేస్ క్రీక్ దగ్గర ఆదివారం మధ్యాహ్నం 3:41 గంటలకు రికార్డు స్థాయిలో 54.4 డిగ్రీల (130 డిగ్రీల ఫారెన్‌‌‌‌ హీట్) ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఇది అధికారంగా ఇంకా ప్రకటించలేదు. అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ దీన్ని వెరిఫై చేస్తోంది. యుఎస్ పశ్చిమ తీరంలో ప్రస్తుతం వేడిగాలులు వీస్తున్నాయి. ఇక్కడ ఈ వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరో 10 రోజులపాటు వేడి వాతావరణం కొనసాగనుంది. దీంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

For More News..

చైనాకు పోటీ ఇవ్వలేకపోతున్న లోకల్‌ కంపెనీలు

పెద్ద ఖర్చులను రిటర్నులో చెప్పక్కర్లేదు

ఉద్యోగం పోయి.. సొంతూళ్లలో రైతులైనరు