గుల్మార్గ్‌లో అతి పెద్ద ఇగ్లూ కేఫ్

గుల్మార్గ్‌లో అతి పెద్ద ఇగ్లూ కేఫ్

వర్షం పడితేనే మనం మురిసిపోతాం. వర్షాన్ని చూస్తూ.. తడుస్తూ ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటిది మంచు వర్షం పడితే... చల్లగా మంచు కురుస్తూ ఉంటూ.. ఆ సీన్ చూడటానికి.. ఆస్వాదించడానికి చాలా అద్భుతంగా ఉంది. అలాంటి ప్రాంతాలు మనదేశంలో చాలానే ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్... జమ్ముకాశ్మీర్‌కు వెళ్తే.. మనం స్నో ఫాల్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఎత్తైన పర్వతాలు.. తెల్లగా పరుచుకున్న మంచు దప్పట్లు.. మధ్యలో మంచుతో నిర్మించిన ఇళ్లు. వాహ్‌  అనిపించేలా అక్కడి అందాలు మనల్ని కట్టి పడేస్తాయి. అయితే మంచులో నిర్మించే ఇళ్లను ఇగ్లూ అంటారని మనం చిన్నప్పటి పుస్తకాల్లో చదువుకున్నాం. అలాంటి ఇళ్ళు మనకు ఇక్కడే కనిపిస్తాయి. అయితే తాజాగా ఇగ్లూ కాకుండా ఇగ్లూ కేఫ్ ఒకటి జమ్ముకాశ్మీర్ ప్రజల్ని, పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. 

ఇగ్లూ కేఫ్ - 'స్నోగ్లు' జమ్ముకాశ్మీర్ గుల్మార్గ్‌లో ఏర్పాటు చేయబడింది. 37.5 అడుగుల ఎత్తు, 44.5 అడుగుల వెడల్పున్న ఈ కఫే 40 మందికి ఆతిథ్యమివ్వగలదు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఇగ్లూ కఫే అని నిర్వాహకులు చెబుతున్నారు.  కొన్నేళ్ల క్రితం స్విట్జర్లండ్‌లో చూసిన ఇలాంటి హోటళ్లు, కఫేలే దీని రూపకల్పనకు స్ఫూర్తి అన్నారు.

 "ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్. మేము ప్రపంచ రికార్డు కోసం దరఖాస్తు చేసాము, ప్రక్రియ కొనసాగుతోంది. చివరి ప్రపంచ రికార్డు 2016లో స్విట్జర్లాండ్ నుండి వచ్చింది, మేము దానిని అధిగమించాము. ఇది 37.5 అడుగుల పొడవు & 44.5 అడుగుల వ్యాసం," అని ఇగ్లూ సభ్యుడు మహూర్ చెప్పారు. కేఫ్‌లో  రెండు విభాగాలు ఉన్నాయి. సీటింగ్ కోసం ఒకటి . ఆర్ట్ స్పేస్ కోసం మరొకటి. గొర్రె చర్మాన్ని సీటు కవర్లుగా ఉపయోగించారు. ఇగ్లూ కేఫ్ నిర్మాణం పూర్తి చేయడానికి తమకు 2 నెలలు పట్టిందన్నారు. సందర్శకులు ఇక్కడ సాంప్రదాయ కాశ్మీరీ వంటకాలను ఆస్వాదించవచ్చని మహూర్ తెలిపారు. 

అయితే గతేడాది కూడా 4 టేబుళ్లతో 16 మంది కూచునేలా ఆసియాలోకెల్లా అతి పెద్ద ఇగ్లూ కఫే ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు.. ఈసారి 10 టేబుళ్లకు, 40 మంది సామర్థ్యానికి పెంచామన్నారు. దీన్ని 25 మంది 64 రోజుల పాటు రేయింబవళ్లు కష్టపడి ఐదడుగుల మందంతో కట్టారు. ఇది మార్చి 15 దాకా కరగకుండా ఉంటుందని ఆశిస్తున్నాం. ఆ తర్వాత మూసేస్తాం’’ అని వివరించారు.

ఇవి కూడా చదవండి: 

దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు

కోవిడ్ రూల్స్ పాటిస్తూ తరగతులు నిర్వహణ