కోవిడ్ రూల్స్ పాటిస్తూ తరగతుల నిర్వహణ

కోవిడ్ రూల్స్ పాటిస్తూ తరగతుల నిర్వహణ

ఢిల్లీలో స్కూళ్లు తెరచుకున్నాయి. దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైన తర్వాత స్కూళ్లను మూసేశారు. అయితే కేసులు భారీగా తగ్గడం... థర్డ్ వేవ్ ముగింపు దిశగా వెళ్తుండడంతో... స్కూళ్లను తెరిచారు. 9 నుంచి 12వ తరగతులకు మాత్రమే స్కూళ్లు ఓపెన్ అయ్యాయి. ఢిల్లీ కంటోన్మెంట్ లోని సర్వోదయ కన్యా విద్యాలయను సందర్శించారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. స్కూళ్లో వసతులను బట్టి 60 నుంచి 70శాతం విద్యార్థులను పిలుస్తున్నట్టు సిసోడియా తెలిపారు. గవర్నమెంట్ స్కూళ్లలో 95శాతం మంది స్టూడెంట్స్ కు, ప్రైవేట్ స్కూళ్లలో 50శాతం మంది స్టూడెంట్స్ కు వ్యాక్సినేషన్ జరిగిందని సిసోడియా చెప్పారు. ఈ నెల 14 నుంచి నర్సరీ నుంచి 8వ తరగతి వరకు స్కూళ్లు ఓపెన్ చేస్తామన్నారు సిసోడియా. మరోవైపు ఉత్తరప్రదేశ్, కేరళ, ఒడిశా, బిహార్ రాష్ట్రాల్లోని స్కూల్స్ తెరుచుకున్నాయి. కోవిడ్ రూల్స్ పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. 

మరిన్ని వార్తల కోసం

ఇయ్యాల్టి నుంచి ఆఫీసులకు అందరూ రావాలె

యూపీలో పవర్​లోకి వస్తే.. సీఎంగా మళ్లీ యోగి