
‘కార్ల్ మార్క్స్ హాఫ్’ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్. ఆస్ట్రీయా రాజధాని వియన్నాలో ఉన్న ఈ పొడవాటి భవనాన్ని 1927-1930 మధ్య కాలంలో నిర్మించారు. ఈ బిల్డింగ్ ఏకంగా 1100 మీటర్ల పొడవు ఉంటుంది. అంటే కిలోమీటరుకు పైనే ఉంటుంది. ఇందులో సుమారు 1,300లకు పైగా అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఐదు వేల కుంటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే ఈ భవనం అప్పట్లో వియన్నా సోషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ వియన్నా అధీనంలో ఉండేది. ప్రజల నుంచి ప్రత్యేకమైన పన్నులు వసూలు చేసి మరీ దీన్ని నిర్మించారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా వేలాది ఇళ్లు ధ్వంసం కావడంతో బాధితులకు ఇందులో నివాసాలు కల్పించేందుకు ఖకార్ల్ మార్క్స్‌హాఫ్‌గను నిర్మించారు. అదే ప్రపంచంలోనే అతిపొడవైన నివాస సముదాయంగా చరిత్రలో నిలిచిపోయింది.