ఇంకా సిద్ధం కాని ఉప్పల్ స్టేడియం 

ఇంకా సిద్ధం కాని ఉప్పల్ స్టేడియం 

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం భారత్ - ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్ జరగనుంది. అష్టకష్టాలు పడి మ్యాచ్ టికెట్లు దక్కించుకున్న వారికి స్టేడియంలో సమస్యలు స్వాగతం పలకనున్నాయి. మ్యాచ్కు కేవలం రెండు రోజులే మిగిలి ఉన్నప్పటికీ ఏర్పాట్లు చేయడంలో హెచ్సీఏ ఘోరంగా విఫలమైంది. స్టేడియం లోపల ఎటు చూసినా విరిగిపోయిన ఛైర్లు, దుమ్ము పట్టిన కుర్చీలే కనిపిస్తున్నాయి. విరిగిన ఛైర్లకు రిపేర్లు చేయడం మాట అటుంచితే గాలివానలకు దుమ్ముతో నిండిపోయిన కుర్చీలను శుభ్రం చేసే నాధుడే లేకుండా పోయాడు. మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో ఈదురుగాలులకు స్టేడియం పై కప్పు లేచిపోయింది. 

ఉప్పల్ స్టేడియంలో చివరిసారిగా 2019లో మ్యాచ్ జరిగింది. కరోనా కారణంగా ఆ తర్వాత మ్యాచ్ లు జరగకపోవడంతో దాన్ని పట్టించుకునే వారే లేకుండాపోయారు. దాదాపు రూ.10వేలు పెట్టి టికెట్ కొని క్రికెట్ చూసేందుకు వచ్చే వారు సైతం దుమ్ము, ధూళితో కూడిన ఛైర్లలో కూర్చోక తప్పని పరిస్థితి. ఈ విషయాన్ని మీడియా అజారుద్దీన్ దృష్టికి తీసుకురాగా రిపేర్ చేయించేందుకు హెచ్సీఏ దగ్గర పైసల్లేవని చెప్పడం విశేషం.