
ఎదైనా రోగమొస్తే దవాఖానాకు పోతం.. ఇక్కడ కనిపిస్తున్న దవాఖానాకు వెళ్తే ఉన్నరోగం పోవుడేమో గాని కొత్త రోగం వచ్చేలా ఉంది. నిజామాబాద్ చంద్రశేఖర్ కాలనీలో గవర్నమెంట్ హాస్పిటల్ దుస్థితి ఇది. చిన్న వాన పడితే చాలు చుట్టూ ఉన్న డ్రైనేజీలు పొంగి దవాఖానాలో చేరి మురికినీటి కుంటలా మారుతోంది. వానాకాలం మొత్తం దాదాపుగా ఇలాగే ఉండే పరిస్థితి. బుధవారం ఇమ్యూనైజేషన్‌లో భాగంగా చిన్నారులకు టీకాలు వేయించేందుకు వచ్చే వారు ఈ మురికి నీటిలోంచే నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. చంటి పిల్లలకు వ్యాధులు రాకుండా సూదిమందు వేయించేందుకు దవాఖానాకు వస్తే.. ఇక్కడి అపరిశుభ్రత, దోమలతో పిల్లలు, మేము అనారోగ్యాల పాలయ్యేట్టు ఉన్నామని తల్లులు అన్నారు. ఈ పీహెచ్‌సీకి ప్రతిరోజు వందమంది వరకు ఔట్ పేషెంట్లు వస్తుంటారు.
–వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్