WPL లో గుజరాత్ గెలుపు బాట

WPL లో  గుజరాత్ గెలుపు బాట


వడోదరా: డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌లో మూడు వరుస పరాజయాల తర్వాత గుజరాత్‌‌‌‌‌‌‌‌ జెయింట్స్‌‌‌‌‌‌‌‌ కీలక విజయంతో మెరిసింది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో సోఫీ డివైన్‌‌‌‌‌‌‌‌ (50 నాటౌట్‌‌‌‌‌‌‌‌), బెత్‌‌‌‌‌‌‌‌ మూనీ (38) రాణించడంతో.. గురువారం జరిగిన లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గుజరాత్‌‌‌‌‌‌‌‌ 45 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో యూపీ వారియర్స్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన గుజరాత్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 153/8 స్కోరు చేసింది. వ్యాట్‌‌‌‌‌‌‌‌ హోడ్జ్‌‌‌‌‌‌‌‌ (14), అనుష్క శర్మ (14), కశ్వీ గౌతమ్‌‌‌‌‌‌‌‌ (11) మోస్తరుగా ఆడినా... ఆష్లే గార్డ్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ (5), భారతి (5), కనిక (6), రేణుకా సింగ్‌‌‌‌‌‌‌‌ (1) సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు.

 క్రాంతి గౌడ్‌‌‌‌‌‌‌‌, సోఫీ ఎకిల్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత యూపీ 17.3 ఓవర్లలో 108 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. ఫోబ్ లిచ్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ (32), చోలే ట్రయాన్‌‌‌‌‌‌‌‌ (30 నాటౌట్‌‌‌‌‌‌‌‌) మినహా మిగతా వారు నిరాశపర్చారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు రాజేశ్వరి (3/16), రేణుకా సింగ్‌‌‌‌‌‌‌‌ (2/20), సోఫీ డివైన్‌‌‌‌‌‌‌‌ (2/16) దెబ్బకు యూపీ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఎనిమిది మంది సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు. రాజేశ్వరికి ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. తాజా విజయంతో గుజరాత్‌‌‌‌‌‌‌‌ (6) ఆఖరి ప్లేస్‌‌‌‌‌‌‌‌ నుంచి రెండో స్థానానికి దూసుకొచ్చి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.