ఒలింపిక్స్ ఫైనల్స్ కు రెజ్లర్ రవికుమార్ దహియా

V6 Velugu Posted on Aug 04, 2021

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం ఖాయమైంది. రెజ్లింగ్ లో రవికుమార్ దహియా విజయ పరంపరను కొనసాగిస్తూ ఫైనల్లో ప్రవేశించాడు. 57 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో రవికుమార్ దహియా కజకిస్థాన్ రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్ పై విజయం సాధించాడు. 

ఓ దశలో రవికుమార్ 2-9తో వెనుకబడి ఉండగా.. అప్పటికి మ్యాచ్ ముగిసేందుకు 30 సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మ్యాచ్ గెలవలేని స్థితిలో రవికుమార్ తన ప్రత్యర్థి నూర్లిసామ్ సనయేవ్ ను దొరకబుచ్చుకుని ఉడుం పట్టు పట్టాడు. తద్వారా ప్రత్యర్థిని ఫాలౌట్ చేశాడు. దాంతో మ్యాచ్ లో విజయంతో పాటు పతకం కూడా ఖాయమైంది.

రవికుమార్ ఫైనల్లో రష్యా ఒలింపిక్ కమిటీ (ROC) జట్టుకు చెందిన ఉగుయేవ్ తో తలపడనున్నాడు.

Tagged Tokyo Olympics, Wrestler Ravi Kumar Dahiya, Finals

Latest Videos

Subscribe Now

More News