V6 News

భారత రెజ్లర్‌‌పై జీవిత కాలం నిషేధం

భారత రెజ్లర్‌‌పై జీవిత కాలం నిషేధం

భారత రెజర్లపై జీవిత కాలం వేటు పడింది. ఓ రిఫరీపై దాడి చేయడంతో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలు ఇంగ్లండ్ లోని బర్మింగ్ హోమ్ వేదికగా 2022, జూలై 28వ తేదీ నుంచి జరుగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా... ఈ క్రీడల్లో పాల్గొనే జట్ల ఎంపిక కోసం భారత్ లో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. రెజ్లింగ్ పోటీలు జరుగుతున్నాయి. సర్వీసెస్ జట్టుకు చెందిన రెజ్లర్ సతేందర్ సింగ్, మోహిత్ ల మధ్య పోటీ జరుగుతోంది. 125 కేజీల విభాగంలో జరిగిన ఈ పోటీలో మోహిత్ చేతిలో సతేందర్ పరాజయం చెందాడు. 

 


అంతకుముందు... సతేందర్ సింగ్ 3-0 తో ఆధిక్యంలో ఉన్నాడు. సతేందర్ ను మ్యాట్ బయటకు నెట్టేశాడు. అయినా.. మోహిత్ కు రిఫరీ ఒక పాయింట్ కేటాయించారు. దీంతో మోహిత్ రివ్యూ కోరాడు. ఇక్కడ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తాను సతేందర్ మాలిక్ ఒకే గ్రామానికి చెందిన వాళ్లం కాబట్టి.. తాను తీసుకొనే నిర్ణయం అతనికి అనకూలంగా ఉంటే.. పక్షపాత ధోరణి అవలింబించారనే అపవాదు వస్తుందని.. జ్యూరీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో సీనియర్ రిఫరీ జగ్జీర్ సింగ్ కు అప్పగించారు.  వీడియో ఫుటేజ్ ని పరిశీలించిన అతను.. మోహిత్ కు ఏకంగా మూడు పాయింట్లు కేటాయించాడు.



దీంతో 3-3 తో మోహిత్ ముందుకొచ్చాడు. ఆఖర్లో ఓ పాయింట్ చేజిక్కించుకుని సతేందర్ మాలిక్ ను ఓడించాడు. ఫలితంతో సతేందర్ ఆగ్రహానికి గురయ్యాడు. మరో మ్యాచ్ లో రిఫరీగా వ్యవహరిస్తున్న నజగ్జీర్ సింగ్ దగ్గరకు వెళ్లిన సతేందర్ వాగ్వాదానికి దిగాడు. అతనిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో స్టేడియంలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చివరకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు రంగప్రవేశం చేసి.. సతేందర్ మాలిక్ ను బయటకు తీసుకెళ్లారు. అతనిపై జీవిత కాలం నిషేధం విధించినట్లు వెల్లడించింది. 

మరిన్ని వార్తల కోసం : -

SRHతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై



భార్య మోసం, స్నేహితుడి ద్రోహం నుంచి దినేష్ కార్తీక్ ఎలా బయటపడ్డాడు ?