
నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో ఎల్లమ్మ జాతర సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీల్లో ఒంటిచేతి వీరుడు కుస్తీ పోటీలో అలరించాడు మహారాష్ట్ర కు చెందిన ఒంటిచేతి వీరుడు చంద్రుడు నిర్వహించిన కుస్తీ పోటీలో లో వ్యక్తిని చిత్తుచేసి విజయం సాధించి ఔరా అనిపించాడు. ఎల్లమ్మ జాతర సందర్భంగా చందూర్ మండల కేంద్రంలో జాతరతో పాటు కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీల్లో చుట్టు పక్కల గ్రామాలతో పాటు మహారాష్ట్రకు చెందిన పలువురు మల్లయోధులు పాల్గొన్నారు. మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలో గల్ గల్ గ్రామానికి చెందిన గణేష్ కు కుడిచేతి ప్రమాదంలో కోల్పోయాడు అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రత్యర్థితో తలపడి విజయం సాధించాడు. ఇటీవల సంబంధిత గొల్లపల్లి అన్ని గ్రామాల్లో జరిగిన కుస్తీ పోటీల్లో గణేష్ పాల్గొని విజయం సాధించాడు.