ఊపిరి పీల్చుకున్న అభిమానులు: టీమిండియాకు తప్పిన ఫాలో ఆన్ గండం

ఊపిరి పీల్చుకున్న అభిమానులు: టీమిండియాకు తప్పిన ఫాలో ఆన్ గండం

'ఐపీఎల్ హీరోలం.. ఐసీసీ టోర్నీల్లో జీరోలం..' ఈ వ్యాఖ్య భారత క్రికెటర్లకు బాగా సరిపోతోంది. ఐపీఎల్ అంటే చెలరేగి ఆడే భారత ఆటగాళ్లు ఐసీసీ ఈవెంట్లలో మాత్రం తేలిపోతున్నారు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ అదే జరిగింది. ఆదుకుంటారనుకున్న రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ, చటేశ్వర్‌ పుజారా వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో భారత్ కు కష్టాలు తప్పలేదు.150 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయింది. ఇక ఫాల్ఆన్ తప్పదనుకున్నప్పటికీ.. ర‌హానే- శార్దూల్‌ జోడి ఆ గండం నుంచి గ‌ట్టెక్కించారు.

151 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను ర‌హానే- శార్దూల్‌ ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించారు. అయితే లంచ్ బ్రేక్ తరువాత ఆట ప్రారంభమైన కాసేపటికే రహానే వెనుదిరిగాడు. క్రిస్ గ్రీన్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో 89 పరుగుల్ వద్ద రహానే పోరాటం ముగింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన ఉమేష్ యాదవ్(5) రూపంలో భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. పస్తుతానికి శార్దూల్-షమీ ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. వేగంగా ఆడుతూ ఆసీస్ లీడ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. శార్దూల 51, షమీ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.