కరోనాతో వుహాన్​ ఆస్పత్రి డైరెక్టర్​ మృతి

కరోనాతో వుహాన్​ ఆస్పత్రి డైరెక్టర్​ మృతి

చైనాలో కరోనా వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తోంది. దీంతో ఆ దేశ  ప్రజలు వైరస్‌తో భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాదు కరోనా వైరస్ వ్యాప్తికి సెంటరైన వుహాన్ లోని వుచాంగ్ హాస్పిటల్ డైరెక్టర్ ల్యూ జిమింగ్ కూడా వైరస్ సోకి చనిపోయారు. ఆయన్ను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని… అయినా రక్షించుకోలేక పోయామని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఇవాళ) మంగళవారం ప్రకటించింది. దీనిపై చైనా వ్యాప్తంగా తీవ్ర సంతాపం వ్యక్తమైంది. వైరస్ వ్యాప్తి భారీగా పెరిగిపోవడంతో చైనాలో మెడికల్ స్టాఫ్ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా మెడికల్ స్టాఫ్ కు కరోనా వైరస్ సోకుతోంది. ఇప్పటివరకు 1,716 మంది మెడికల్ స్టాఫ్ కరోనా వైరస్ బారిన పడ్డారని, అందులో ఆరుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. వుహాన్ లోని ఆస్పత్రుల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారని.. మెడికల్ స్టాఫ్ కు సరిపడా మాస్కులు, ప్రొటెక్టివ్ సూట్లు అందుబాటులో లేవని కొందరు హెల్త్ వర్కర్లు ఆరోపిస్తున్నారు.