జాట్‌‌తో టాప్​ కాలేజ్​లో ఎంబీఏ

జాట్‌‌తో టాప్​ కాలేజ్​లో ఎంబీఏ

దేశంలో మేనేజ్‌‌మెంట్‌‌ విద్యలో అడ్మిషన్స్​కు నిర్వహించే పరీక్షల్లో క్యాట్‌‌ తర్వాత పేరున్నది జేవియర్‌‌ ఆప్టిట్యూడ్‌‌ టెస్ట్‌‌ (జాట్‌‌). ఇందులో సాధించిన స్కోరుతో దేశవ్యాప్తంగా 160 బిజినెస్‌‌ స్కూళ్లలో ఎంబీఏ/ పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశానికి అప్లై చేసుకోవచ్చు. వచ్చే విద్యా సంవత్సరంలో కోర్సుల్లో ప్రవేశానికి ఎక్స్‌‌ఏటీ - 2023 నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది.

కోర్సులు:  పీజీడీఎం: బిజినెస్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ (బీఎం), హ్యూమన్‌‌ రిసోర్స్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ (హెచ్‌‌ఆర్‌‌ఎం), జనరల్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ (జీఎం), ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూర్‌‌షిప్, వెంచర్‌‌ క్రియేషన్‌‌ (ఐఈవీ). వీటిని ఫుల్‌‌టైం రెసిడెన్షియల్‌‌ విధానంలో అందిస్తున్నారు.

ఎఫ్‌‌పీఎం (ఫెలో ప్రోగ్రాం ఇన్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌): పీజీ పూర్తిచేసుకున్నవారు, ప్రొఫెషనల్‌‌ కోర్సులు చదివినవాళ్లు, పని అనుభవం ఉన్నవారికోసం ఉద్దేశించిన ఈ కోర్సు నాలుగేళ్ల వ్యవధితో అందుబాటులో ఉంది.  

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో రెండు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, డెసిషన్‌ మేకింగ్, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌ 2లో జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్​ మార్కింగ్​ ఉంటుంది. 

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఫైనల్ ఇయర్​ చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్​ ఫీజు రూ. 2000 చెల్లించి ఆన్​లైన్​లో నవంబర్​ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జామ్​ జనవరి 8న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.xatonline.in వెబ్​సైట్​ సంప్రదించాలి.