హాంకాంగ్ పూర్తిగా చైనా నియంత్రణలోనే ఉంది

హాంకాంగ్ పూర్తిగా చైనా నియంత్రణలోనే ఉంది

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాంకాంగ్పై  కీలక వ్యాఖ్యలు చేశారు. హాంకాంగ్  పూర్తిగా చైనా నియంత్రణలో ఉందని తెలిపారు. దీని ద్వారా అల్లర్ల నుంచి సుపరిపాలన దిశగా హాంకాంగ్‌ మార్పు చెందుతోందన్నారు.  స్వపరిపాలన కావాలంటున్న తైవాన్‌లో వేర్పాటు వాదం.. విదేశీ శక్తుల జోక్యంపై  చైనా పోరాటం చేస్తోందని చెప్పారు. 

చరిత్ర సృష్టించనున్న జిన్‌పింగ్
చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 16 నుంచి 22 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సదస్సులో  2,296 మందికిపైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ మీటింగ్లోనే  చైనా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో మరోసారి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే..వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టి జిన్ పింగ్ చరిత్ర సృష్టిస్తారు.