షియోమీ నుంచి స్మార్ట్‌‌‌‌బల్బ్

షియోమీ నుంచి స్మార్ట్‌‌‌‌బల్బ్

న్యూఢిల్లీ:  చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌‌‌‌ కంపెనీ షియోమీ తన ఎంఐ ఎల్‌‌‌‌ఈడీ స్మార్ట్ బల్బ్‌‌‌‌ అమ్మకాలను ప్రారంభించినట్టు సీఈఓ మనూ జైన్‌‌‌‌ తెలిపారు. కంపెనీ క్రౌడ్‌‌‌‌ ఫండింగ్‌‌‌‌ వేదిక  ద్వారా దీనిని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మనదేశంలో విడుదల చేశారు.  రూ.1299 ధర ఉండే ఎంఐ ఎల్‌‌‌‌ఈడీ స్మార్ట్‌‌‌‌బల్బ్‌‌‌‌ను ఫ్లిప్‌‌‌‌కార్ట్, అమెజాన్, ఎంఐ ఆన్‌‌‌‌లైన్ స్టోర్‌‌‌‌లలో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. 10 వాట్ల సామర్థ్యం కలిగిన ఈ బల్స్‌‌‌‌ను 800 ల్యూమెన్స్ బ్రైట్‌‌‌‌నెస్‌‌‌‌ను విడుదల చేస్తుంది. అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌‌‌‌లను సపోర్ట్‌‌‌‌ చేస్తుంది. ఎంఐ హోమ్‌‌‌‌ యాప్‌‌‌‌ సహాయంతో దీనిని ఆపరేట్ చేసుకోవచ్చు.  ఈ బల్బు ద్వారా 16 మిలియన్ల రంగుల కాంతిని వెలువరిస్తుంది. దీనిని నిత్యం ఆరు గంటల పాటు వాడితే 11 సంవత్సరాల వరకు పనిచేస్తుందని జైన్‌‌‌‌ తెలిపారు. ఫిలిప్స్‌‌‌‌, సిస్కా, విప్రో వంటి కంపెనీలు కూడా ఇండియన్‌‌‌‌ మార్కెట్లోకి స్మార్ట్‌‌‌‌బల్బులను విడుదల చేశాయి.