- యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి
యాదాద్రి, వెలుగు : క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశంలో జిల్లాలో ఉన్న హాస్పిటల్స్, వాటిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నవి, చేయించుకోని ఎన్ని ఉన్నాయో కలెక్టర్ ఆరా తీశారు.
అప్లికేషన్ చేసుకున్న వాటిలో ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయని డీఎంహెచ్‌వో డాక్టర్ మనోహర్‌ను ఆయన ప్రశ్నించారు. దీంతో అప్లికేషన్ చేసుకున్న వాటిలో ఇంకా 17 పెండింగ్‌లో ఉన్నాయని డీఎంహెచ్‌వో తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. అప్లికేషన్ చేసుకొని పెండింగ్‌లో ఉన్న 17 హాస్పిటల్స్‌లో మే 7 లోపు తనిఖీలు చేసి రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు.
రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన హాస్పిటల్స్ అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఎన్సీడీ కార్యక్రమంలో పనితీరు సరిగా లేని పీహెచ్సీల్లో స్క్రీనింగ్ పెంచాలన్నారు. హాస్పిటల్స్ మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

