యాదాద్రి, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు జారీ చేస్తూనే ఉంది. కార్డు కావాలని అప్లికేషన్ వచ్చిందంటే.. ఆఫీసర్లు పరిశీలించి అర్హులైతే చాలు ఓకే చేసేస్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి జిల్లాలో నవంబర్ నెలలో ప్రభుత్వం 4917 కార్డులను కొత్తగా జారీ చేసినట్టుగా సివిల్ సప్లయ్డిపార్ట్మెంట్‘డైనమిక్ కీ రిజిస్టర్’ (డీకేఆర్) లెక్కలు చెబుతున్నాయి.
దీంతో గత నెల 11,47,560 కార్డులు ఉండగా తాజాగా వాటి సంఖ్య 11,52,477కు చేరింది. యూనిట్ల సంఖ్య గత నెల వరకూ 34,66,221 ఉండగా తాజాగా 14,376 పెరగడంతో 34,80,597కు చేరింది. బియ్యం కోటా గత నెలలో 22,007 టన్నులు ఉండగా 92 టన్నులు పెరిగి 22,099 టన్నులకు చేరింది.
జిల్లా కార్డులు యూనిట్లు బియ్యం కోటా
యాదాద్రి 2,48,593 7,82,153 4,957.818
సూర్యాపేట 3,67,781 10,71,265 6,798.994
నల్గొండ 5,36,103 16,27,179 10,342.242
