- యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి, వెలుగు : ప్రభుత్వ హాస్టల్ లోని స్టూడెంట్స్‌కు హెల్తీ ఫుడ్ అందించాలని యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు సూచించారు. యాదాద్రి కలెక్టరేట్లో హాస్టల్స్, గురుకుల పాఠశాలల్లో వంట చేసే మాస్టర్లకు పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహారంపై 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ట్రైనర్స్ ఆంజనేయులు, వివేక్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్టూడెంట్స్‌కు అందించే ఆహారం ఆరోగ్యకరమైనదిగా ఉండాలని సూచించారు. ఈ విషయాల్లో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రైనీలు మాట్లాడుతూ వంటకు ఉపయోగించే పదార్థాలు నాణ్యతపై రాజీ పడవద్దని సూచించారు. వంట సామగ్రిని శుభ్రంగా కడగాలని, తాగునీరు స్వచ్ఛమైందిగా ఉండేలా చూసుకోవాలన్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి..
హాలియా, వెలుగు : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. నిడమనూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, మైనార్టీ గురుకుల పాఠశాలను ఆయన శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వంటలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆయా పాఠశాలలో వసతి గృహం, వంటశాల, తరగతి గదులు, పరిసరాలను స్టోర్ రూమ్ లో కూరగాయల నిల్వలు, సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం నిడమనూరు మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సూర్యాపేట జిల్లా కలెక్టర్ సడన్ విజిట్..
హుజూర్ నగర్, వెలుగు : హుజూర్ నగర్ బాలికల ఉన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సడన్‌గా విజిట్ చేశారు. 10వ తరగతి క్లాస్ రూమ్ లోకి వెళ్లి ఫిజిక్స్ సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులకు వేసి సమాధానాలు రాబట్టారు. మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే బియ్యాన్ని పరిశీలించారు. వంట సామగ్రి, కూరగాయలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.