ప్రతి వాహనం చెక్ చేయండి : కలెక్టర్ హనుమంతరావు

ప్రతి వాహనం చెక్ చేయండి : కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి, వెలుగు:  పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ప్రతి వాహనాన్ని తప్పని సరిగా చెక్​ చేయాలని కలెక్టర్​ హనుమంతరావు ఆదేశించారు. యాదాద్రి జిల్లా వలిగొండలోని చెక్​పోస్ట్​ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోజు ఎన్ని వాహనాలను తనిఖీ చేశారో అడిగి తెలుసుకున్నారు. దారిలో వెళ్లే ప్రతి వాహనం చెక్​ చేస్తూ వీడియో తీయించడంతో పాటు వాటి వివరాలు నమోదు చేయాలన్నారు. రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు ఉంటే సీజ్​ చేయాలన్నారు.