అనాథ పిల్లలతో కలిసి రాచకొండకు ట్రైనీ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌లు

అనాథ పిల్లలతో కలిసి రాచకొండకు ట్రైనీ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌లు

సంస్థాన్‌‌‌‌‌‌‌‌ నారాయణపురం, వెలుగు : రాచకొండ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతోందని యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి చెప్పారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరుగురు ట్రైనీ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌లు 50 అనాథ పిల్లలతో కలిసి మంగళవారం రాచకొండ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి రాచకొండ రాజుల చరిత్ర, వారి పాలన, కట్టడాల విశిష్టతను వివరించారు. ట్రైనీ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌లు రాచకొండలోని రాతికట్టడాలు, కోటలను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ దీపక్‌‌‌‌‌‌‌‌ తివారి, ట్రైనీ కలెక్టర్లు శౌర్యమాన్‌‌‌‌‌‌‌‌ పటేల్, అసిమా గోయల్, అభిషేక్, అక్షిత్‌‌‌‌‌‌‌‌ ఆయుశ్‌‌‌‌‌‌‌‌, శ్వేతా పాండే, సుగవ్య చంద్ర, డీఅర్డీవో ఉపేందర్, శిశు సంక్షేమ శాఖ పీడీ కృష్ణవేణి, యువజన సంక్షేమ, ఉపాధి కల్పనశాఖ అధికారి ధనుంజనేయులు, అనాథ పిల్లల సంరక్షణ అధికారి సిలువేరు సైదులు, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసరాజు, ఎంపీడీవో రాములు ఉన్నారు. 

పర్యాటకంపై ప్రచారం చేయాలి

సూర్యాపేట, వెలుగు: పర్యాటక రంగానికి ఎంతో ప్రయారిటీ ఇస్తున్నామని సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శివాలయంలో నిర్వహించిన కళాబృందాల ర్యాలీని మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆలయాలు, టూరిస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాల టూరిస్ట్‌‌‌‌‌‌‌‌లను ఆకట్టుకునేలా ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం పాంప్లెంట్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏ‌‌‌‌‌‌‌‌పీఆర్‌‌‌‌‌‌‌‌వో రమేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, డీఈ మల్లేశం, శివాలయ చైర్మన్‌‌‌‌‌‌‌‌ వల్లాల సైదులు, చెన్న కేశవస్వామి ఆలయ సమన్వయ కమిటీ సభ్యులు రాపర్తి మహేశ్‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.