యాదాద్రి లో ఇందిరమ్మ ఇండ్ల పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి లో ఇందిరమ్మ ఇండ్ల పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ హనుమంతరావు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు స్పీడప్ చేయాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసుకుని దసరా పండుగ నాటికి గృహప్రవేశాలు నిర్వహించుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న గొట్టిపర్తి కౌసల్య, కళ్లెం బాలమణి లబ్ధిదారులకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల పనులను బుధవారం ఆయన పరిశీలించారు.  ముగ్గురు లబ్ధిదారుల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని స్థానిక కాంగ్రెస్ నాయకుడు కళ్లెం జహంగీర్ గౌడ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి సమస్య వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ ఇండ్లను నిర్మిస్తున్న మేస్త్రీలకు స్క్వేర్ ఫీట్ కు రూ.300 కంటే ఎక్కువ ఇవ్వొద్దని లబ్ధిదారులకు సూచించారు.  మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ యాకూబ్, విలేజ్ సెక్రటరీ నరేశ్ ఏఎంసీ డైరెక్టర్ నసీరుద్దీన్, గ్రామస్తులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.