- యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి
యాదగిరిగుట్ట, వెలుగు : దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని దివ్యాంగుల పునరావాస కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కేంద్రంలోని పిల్లల వయసు, వారి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న ప్రత్యేక శిక్షణ, విద్యా సౌకర్యాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న నూతన భవనాన్ని పరిశీలించిన కలెక్టర్ పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి పాల్గొన్నారు.
