- యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు
యాదగిరిగుట్ట, వెలుగు: సర్పంచ్ ఎన్నికల కోసం అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టామని యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు. యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లిలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట మండలంలో దాఖలైన 162 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు, 575 వార్డు అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్లు స్క్రూటినీ చేయగా.. ఒక వార్డు అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ అయిందని తెలిపారు.
చిన్నగౌరాయపల్లిలో 7వ వార్డు బీసీ మహిళ రిజర్వేషన్ కాగా.. పురుషుడు నామినేషన్ వేయడంతో.. ఆ నామినేషన్ ను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. స్క్రూటినీ ప్రక్రియ జాగ్రత్తగా చేపట్టాలని, నామినేషన్లను క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని రిటర్నింగ్ ఆఫీసర్లకు సూచించారు.
