
- నిరుడి ఇన్‌కం కన్నా ఎక్కువ
- గత ఏడాదితో పోలిస్తే తగ్గిన సత్యనారాయణ స్వామి వ్రతాల సంaఖ్య
యాదగిరిగుట్ట, వెలుగు : ఈ కార్తీకమాసం యాదగిరి నారసింహుడి సన్నిధికి కాసుల వర్షం కురిపించింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం పెరిగింది. నవంబర్ 14న మొదలైన కార్తీక మాసం డిసెంబర్12న ముగిసింది. ఆలయ ఆఫీసర్లు వెల్లడించిన వివరాలa ప్రకారం.. ఈ 28 రోజుల్లో భక్తులు నిర్వహించిన వివిధ రకాల పూజల ద్వారా స్వామివారికి రూ.14 కోట్ల 91 లక్షల 10,031 వేల ఆదాయం సమకూరింది. గత ఏడాది పూజల ద్వారా రూ.14 కోట్ల 66 లక్షల 43,048 వేలు ఈసారి రూ.24.66 లక్షలు ఎక్కువ వచ్చింది. అయితే, 2022 కార్తీక మాసంలో 21,480 సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించగా, ఈసారి 18,824 మాత్రమే జరిగాయి. ఈ ఏడాది వ్రతాల ద్వారా రూ.1,64,20,600 ఆదాయం రాగా.. లాస్ట్ ఇయర్ రూ.1,69,76,300 వచ్చింది.
రాజన్న హుండీ ఆదాయం 1.99 కోట్లు
వేములవాడ, వెలుగు :దక్షిణకాశీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి రూ. కోటి 99 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ తెలిపారు. 20 రోజుల పాటు హుండీ ఆదాయాన్ని ఆలయ ఓపెన్ స్లాబ్‌లో ఆలయ అధికారుల పర్యవేక్షణలో ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు మధ్య లెక్కించారు. ఈ సందర్భంగా స్వామివారి ఖజానాకు రూ.కోటి 99 లక్షల 38 వేల 997 నగదు, 203 గ్రాముల బంగారం, 10 కిలోల వెండి సమకూరిందని ఈఓ వెల్లడించారు. హుండీ లెక్కింపులో పర్యవేక్షకులు ఏసీ చంద్రశేఖర్, ఆలయ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, శివరామకృష్ణ భజన మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.