తెల్లాపూర్ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటా : ఎంపీ రఘునందన్రావు

తెల్లాపూర్ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటా : ఎంపీ రఘునందన్రావు
  • మున్సిపాలిటీకి అంబులెన్స్​ అందజేత

రామచంద్రాపురం, వెలుగు: తెల్లాపూర్​ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఎంపీ రఘునందన్​రావు హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తెల్లాపూర్​ మున్సిపాలిటీకి అత్యవసర వైద్య సేవల నిమిత్తం అంబులెన్స్​ను ఆయన గురువారం అందజేశారు. అనంతరం నైబర్​ వుడ్స్​అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు కాలనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందరర్భంగా మాట్లాడుతూ అన్ని గేటెడ్​ కమ్యూనిటీలలో ప్రభుత్వం తరపున అందాల్సిన మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు.

 ఈ నెల 26 న సమావేశం నిర్వహించి తెల్లాపూర్​ వాసుల సమస్యలపై అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. దీనిపై మున్సిపల్​ కమిషనర్​కు కీలక ఆదేశాలు ఇచ్చారు. మున్సిపాలిటీ ప్రజలు అంబులెన్స్ సేవల కోసం 7386759108 నెంబర్​కు కాల్​ చేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్​కమిషనర్​ అజయ్​ కుమార్​రెడ్డి, బీజేపీ మున్సిపల్​అధ్యక్షుడు రాంబాబు గౌడ్, పీఏసీఎస్​ చైర్మన్​ బుచ్చిరెడ్డి, నైబర్​ వుడ్స్​ ప్రెసిడెంట్ రమణ, డీఈఈ సత్యనారాయణ, ఏఈ మౌనిక, మేనేజర్​ అఖిల్, నాయకులు రాజు, శ్రీశైలం, రాజేందర్​రెడ్డి, నరేందర్​ రెడ్డి పాల్గొన్నారు.