
- సందడి చేసిన సినీనటి వైష్ణవి చైతన్య
మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ షోరూమ్ ను గురువారం సినీనటి వైష్ణవి చైతన్య ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఇక్కడ లభించే డిజైన్లు మరెక్కడ లభించవన్నారు. అందుకే చందన బ్రదర్స్ షోరూం హైదరాబాద్లో ఫేవరేట్ షోరూంగా మారిందన్నారు. మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు మాట్లాడుతూ మెదక్ పట్టణంలో అందరికీ అందుబాటు ధరల్లో వస్త్రాలు లభించే చందన బ్రదర్స్ షోరూమ్ ప్రారంభించడం హర్షనీయమన్నారు.
షోరూం మేనేజింగ్ డైరెక్టర్ జానా సురేశ్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించిన ప్రతి చోటా అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలతో నెం.1 షోరూంగా నిలవడం తమకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. ఆషాడం, శ్రావణ మాసం సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై తగ్గింపు ధరలతో కస్టమర్స్ కి అందుస్తున్నామన్నారు. జబర్దస్త్ కమెడియన్ లు దొరబాబు, నూకరాజు, రైజింగ్ రాజు, పైమా సందడి చేసి సందర్శకులను అలరించారు.