యాదాద్రి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణపై ఫోకస్ : ఎస్పీ అక్షాంశ్ యాదవ్

యాదాద్రి  జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణపై ఫోకస్ : ఎస్పీ అక్షాంశ్ యాదవ్
  •     యాదాద్రి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్

యాదగిరిగుట్ట, వెలగు: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ పై స్పెషల్ ఫోకస్ పెట్టామని యాదాద్రి ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ ను అడిషన్ ఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. ఎస్పీ హోదాలో ఫస్ట్ టైం యాదగిరిగుట్ట పీఎస్ కు వచ్చిన అక్షాంశ్ యాదవ్ కు యాదగిరిగుట్ట డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి  ఆలయంలో భక్తుల రక్షణార్థం ప్రత్యేక శ్రద్ధ వహించనున్నట్లు పేర్కొన్నారు. 

ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఫ్యామిలీతో కలిసి స్వామివారిని దర్శించుకునేలా చూస్తామన్నారు. చర్యలు తీసుకుంటామన్నారు.  సైబర్ క్రైం, గంజాయి నివారణ, నేరాల సంఖ్యను తగ్గించడానికి ఇప్పటికే చర్యలు చేపడుతున్నామన్నారు.  గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట టౌన్ సీఐ భాస్కర్, రూరల్ సీఐ శంకర్ గౌడ్, ఎస్ఐలు యాదయ్య, సైదులు, రూపాశ్రీ తదితరులు ఉన్నారు.