నా బిడ్డ, అల్లుడు అమాయకులు.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

నా బిడ్డ, అల్లుడు  అమాయకులు.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
  • ప్రత్యర్థుల చేతిలో పావుగా మారిన్రు

జనగామ, వెలుగు: అమాయకురాలైన తన బిడ్డను, అల్లుడిని రాజకీయ ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని టీ హబ్​అప్​గ్రెడేషన్ సెంటర్​ను హెల్త్​ మినిస్టర్​ హరీశ్​​రావు శనివారం వర్చువల్​ పద్ధతిలో ప్రారంభించగా, ఈ కార్యక్రమానికి హాజరైన  ముత్తిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తనను ప్రత్యక్షంగా ఎదుర్కోలేకే తన ప్రత్యర్థులు కుట్రలకు తెరలేపారన్నారు. వివాదాస్పదం అని చెబుతున్న చేర్యాల స్థలంలో తన బిడ్డ నిర్మాణం చేసుకుంటానని చెప్పిందన్నారు. 

కానీ కొందరు ఆమెను మిస్ గైడ్ చేస్తున్నారని కంట తడి పెట్టారు. ఆమెను ఏమీ అనలేకే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తాను జనగామ ప్రజా క్షేత్రంలోనే ఉంటానన్నారు. ప్రత్యర్థులకు దమ్ముంటే తనను నేరుగా ఎదుర్కోవాలని సవాల్​ చేశారు. మున్సిపల్​ చైర్​పర్సన్​పోకల జమునలింగయ్య, జిల్లా హాస్పిటల్ ​సూపరింటెండెంట్​ సుగుణాకర్​ రాజు, గవర్నమెంట్​ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్​ గోపాల్​ రావు, డీఎంహెచ్​వో ప్రశాంత్, డాక్టర్లు మహేశ్​, టీ హబ్​ మేనేజర్​ శ్రీనివాస్ పాల్గొన్నారు.