
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట దేవస్థానం మరో అరుదైన ఘనత సాధించింది. ఉత్తమ పర్యాటక క్షేత్రం గా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవంలో భాగంగా తెలంగాణ టూరిజమ్ ఎక్సలెన్స్ కు ఎంపికయ్యింది.
తెలంగాణ టూరిజమ్ ఎక్సలెన్స్ కు ఎంపికైన తొలి పుణ్యక్షేత్రంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నిలిచింది. శనివారం (సెప్టెంబర్ 27) శిల్పారామం లో సీఎం రేవంత్ రెడ్డి అవార్డు ప్రదానం చేయనున్నారు.
ఉత్తమ పర్యాటక క్షేత్రంగా యాదగిరి గుట్ట దేవస్థానం ఎంపిక కావడంపై రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గగులోతు రవి ఐఏఎస్.